కేరళలో ఒకే ఇంట్లో వంద పాములు

కేరళలో ఒకే ఇంట్లో వంద పాములు
x
Highlights

కేరళలో వరదలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు మెల్లగా పునరావాస శిబిరాల నుంచి మళ్ళీ తమ ఇళ్ళకు చేరుకుంటున్నారు. నీటి ప్రవాహంతో పాడైపోయిన తమ వస్తువులు, ఇతరాలను...

కేరళలో వరదలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు మెల్లగా పునరావాస శిబిరాల నుంచి మళ్ళీ తమ ఇళ్ళకు చేరుకుంటున్నారు. నీటి ప్రవాహంతో పాడైపోయిన తమ వస్తువులు, ఇతరాలను చూసి బావురుమంటున్నారు. కొందరి ఇళ్ళలో నీటిలో కొట్టుకొచ్చిన పాములు, విష కీటకాలు ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కేరళలో వరదలు తగ్గు ముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలు కేరళకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వరదల వల్ల ఇప్పటివరకూ దాదాపు 350మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు భారీ వర్షాలు ఇళ్లు, రోడ్లు నీళ్ల మయంగా మారాయి.

అయితే వరదలు తగ్గు ముఖం పట్టినప్పటికీ అక్కడున్న ప్రజలను మరో భయం వెంటాడుతోంది. పునరావాస శిబిరాల నుంచి సొంత ఇళ్లకు వెళుతున్న ప్రజలకు పాముల భయం పట్టుకుంది. దాదాపు గత మూడు నాలుగు రోజుల్లోనే కేరళ వ్యాప్తంగా భారీగా పాముకాటు కేసులు నమోదయ్యాయి. కేరళలోని ఎర్నాకులం, వ్యాపిన్, వడకర్ర, పరావూర్ ప్రాంతాల్లో పాముకాటు కేసులు ఎక్కువగా నమోదైనట్లు తెలిసింది. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లిన వారు ఇంటిని శుభ్రం చేస్తుండగా అప్పటికే ఇంట్లో, ఇంటి పరిసరాల్లో ఉన్న పాములు కాటేస్తున్నట్లు తేలింది. ఇదిలా ఉంటే.. కొన్ని ఇళ్లలో వరదల ధాటికి తట్టుకోలేక చనిపోయిన పాములు కూడా కనిపిస్తున్నాయి.

పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్తున్న ప్రజలు అక్కడి పరిస్థితిని చూసి షాక్ అవుతున్నారు ఇంటినిడా బురద బురద నీటిలో తడిసి పోయిన విలువైన వస్తువులు దీనికితోడు ఇంటి ప్రాంగణాల్లో విషపూ రిత పాములు, మొసళ్లు సంచరిస్తుండటాన్ని చూసి భయాం దోళనలకు గురవుతున్నారు. ఇప్పుడు ఇదే వారికి పెద్ద సమస్య గా మారుతోంది. కేరళ వరదల కారణంగా వచ్చిన పాముల బెడద అక్కడి ప్రజలను భయ పెడుతోంది సహాయ బృందాలకు కూడా పాముల సంచారం పెద్ద సమస్యగా మారుతోంది. రహదారులను శుభ్రం చేస్తున్న సందర్భంలో పాములు, ఇతర విషపూరిత కీటకాలు కనిపించడం తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. మలప్పురం లోని ఓ ఇంట్లో ఏకంగా 100 పాములు దర్శనమి చ్చాయి.

పాము కాటుకు గురైన వారికి సరైన వైద్యం కూడా అందే పరిస్థితి లేదు మందులు అందుబాటులో లేకపోవడంతో వైద్యులు ఏమీ చేయలేక పోతున్నారు ఇక పాము కాటుకుగురైన వారి నుంచి మాకు అనేక ఫోన్లు వస్తున్నాయి. పాము కరిచిన సమయంలో ఏం చేయాలో ఏ చేయకూడదో సూచనలు ఇస్తున్నాం’’ అని స్నేక్‌బైట్ హీలింగ్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులు చెబుతున్నారు.

పాముల భయంతో అనేక మంది ఇళ్లకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లోనూ ఉంది అయితే అనేక పాములు విషపూరితం కావని, కానీ అవి కాటువేసినప్పుడు తీవ్ర భయాందోళనలకు గురై మరణాలు సంభవిస్తున్నాయని వైద్య అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇళ్లకు వెళ్లే వరద బాధితులు అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటిలోకి వెళ్లే ముందు శబ్దం చేస్తూ వెళ్లాలని సూచన చేశారు. షూస్‌లో చేతులు పెట్టొద్దని.. జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories