ప్రముఖులను టార్గెట్‌ చేస్తున్న కేటుగాళ్లు

ప్రముఖులను టార్గెట్‌ చేస్తున్న కేటుగాళ్లు
x
Highlights

ప్రముఖులను టార్గెట్‌గా చేసుకొని సోషల్‌ మీడియాలో ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారు? ఇలాంటి కథనాలు పోస్ట్ చేస్తున్న వారిని చట్టం ఎలా శిక్షిస్తుంది?...

ప్రముఖులను టార్గెట్‌గా చేసుకొని సోషల్‌ మీడియాలో ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారు? ఇలాంటి కథనాలు పోస్ట్ చేస్తున్న వారిని చట్టం ఎలా శిక్షిస్తుంది? మొన్న షర్మిలా , నిన్న లక్ష్మి పార్వతి , ఈరోజు సినీనటి పూనమ్ కౌర్‌లపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. వారికి మనోవేదన కలిగిస్తున్నారు.

గత కొద్ది రోజులు ప్రముఖులు , సినీతారలు , సినీనటులను టార్గెట్‌ చేసుకొని సోషల్‌ మీడియాలో వారి పై అభ్యంతరకర పోస్ట్లు చేస్తున్నారు కొంత మంది కేటుగాళ్లు దీంతో వారి ప్రతిష్టకి భంగం కలగడమే కాకుండా , మానసిక ప్రశాంతత కూడా లోపిస్తోంది. దీంతో ఏంచేయాలో దిక్కు తోచక తలలు పట్టుకుంటున్నారు. చిన్న విషయాన్నీ కూడా పెద్దదిగా చేసి , ఆధారాలు లేకుండా కొన్ని వెబ్‌సైట్ లు,యూట్యూబ్ ఛానల్స్, పేస్ బుక్,వాట్సప్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు దీంతో బాధితులంతా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ బాటపట్టారు.

కొన్ని రోజులు క్రితమే వైసీపీ నేత వైఎస్ షర్మిల పై సోషల్‌ మీడియా లో తన వ్యక్తి గతాన్ని భంగం కలిగే విధంగా కొంత మంది ఉద్దేశ పూర్వకంగా పోస్ట్ లు పెడుతున్నారు అంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కి ఫిర్యాదు చేశారు తనకు ఓ ప్రముఖ నటుడు తో అక్రమ సంబంధం ఉందని అంటగడుతూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో షర్మిల సైబర్ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ ప్రచారం వెనుకు టీడీపీ హస్తం ఉందని, షర్మిల ఆరోపించారు. అయితే పోలీసులు విచారణలో మాత్రం పోస్ట్‌లు పెట్టిన వారు కొంత మంది ప్రైయివేట్ ఉద్యోగులు , స్టూడెంట్స్ , ముగ్గురు టీడీపీ సానుభూతి పరులు ఉన్నట్లు గుర్తించి 15 మంది పై ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.

షర్మిల వ్యవహారం ఆలా ఉంచితే కొన్ని రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి భార్య ఎన్ఠీఆర్ భార్య లక్ష్మి పార్వతి కూడా డీజీపీ కి ఫిర్యాదు చేశారు. కోటి అనే యువకుడు మీడియా ఛానల్స్ , సోషల్‌ మీడియాలో తన ప్రతిష్ట కు భంగం కలిగే విధంగా అసత్య ఆరోపణలు చేస్తూ కొన్ని అభ్యంతరకర పోస్ట్లు చేశాడు వెంటనే చర్యలు తీసుకొండి అంటూ డీజీపీ మహేందర్ రెడ్డి కి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు కోటి చెపుతున్న దాంట్లో ఎంత వాస్తవం ఉంది .. ? కోటి వెనుక ఉండి ఎవరైనా నడిపిస్తున్నారా ? ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకులు కోటికి డబ్బులు ఆశ చూపి ఈ తతంగం అంత నడిపిస్తున్నారా అనేది బయట నడుస్తున్న చర్చ దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంటున్నారు.

షర్మిల , లక్షి పార్వతి సంగతి ఆలా ఉంచితే తాజాగా ప్రముఖ సినీనటి పూనమ్ కౌర్ కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ బాట పట్టారు కొంత కాలంగా తనపై సోషల్‌ మీడియా లో అసత్య ప్రచారం చేస్తు మానసిక వేదనకు గురి చేస్తున్నారంటూ ప్రముఖ సిని నటి పూనమ్ కౌర్ సైబర్ క్రైమ్ పోలీసులుకి ఫిర్యాదు చేశారు.

ఇలా ప్రముఖులు కానీ , లేదా ఇతరత్రా వ్యక్తులపై అసభ్యంగా, అవమాన పరిచే విధంగా, వారి వ్యక్తి గత జీవిత విషయాలపై ఎవరైనా సోషియల్ మీడియా వేదిక గా పోస్టింగ్ లు పెడితే సైబర్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం అంటున్నారు పోలీసులు. Sections 66A, 67 ఐటీ యాక్ట్‌తో పాటు Section 509 కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories