శరీరానికి చలువదనాన్ని ఇచ్చే పెసరపప్పు

శరీరానికి చలువదనాన్ని ఇచ్చే పెసరపప్పు
x
Highlights

శరీరానికి చలువదనాన్ని ఇచ్చే పెసరపప్పు తరచుగా తీసుకోవడం చాలా అవసరం. పెసలలో విటమిన్ బి, విటమిన్ సి, మాంగనీస్ తోపాటు ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అంతేకాదు...

శరీరానికి చలువదనాన్ని ఇచ్చే పెసరపప్పు తరచుగా తీసుకోవడం చాలా అవసరం. పెసలలో విటమిన్ బి, విటమిన్ సి, మాంగనీస్ తోపాటు ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అంతేకాదు సూర్యుని నుంచి వచ్చే అతినీలిలోహిత కిరణాలు, పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యల నుంచి కాపాడటానికి పెసలు సహకరిస్తాయి.

కావలసిన పదార్ధాలు :

పెసరపప్పు-100 గ్రాములు

పంచదార -125 గ్రాములు

పాలు -1 లీటరు

నెయ్యి -1 చెంచా

కిస్‌మిస్ -1 చెంచా

జాజికాయ పొడి -అర చెంచా

తయారీ విధానం :

స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టి పెసరపప్పు వేసి సన్నని మంట మీద గరిటతో కలుపుతూ ఎర్రగా వేపుకోవాలి. పప్పు ఏ మాత్రం మాడకుండా చూసుకోవాలి. ఈ పప్పుకి అర లీటరు పాలు కలిపి కుక్కర్‌లో పెట్టి ఉడికించాలి. ఈ లోపల పాలు గిన్నెలో పోసి కాగనిచ్చి పంచదార కలిపినప్పుడే కిస్‌మిస్ కూడా వేసి ఉడికించాలి. కుక్కర్‌లోంచి పప్పు తీసి పాలతో పప్పును బాగా మెదిపి కలపాలి. ఈ మిశ్రమానికి చిక్కగా ఉడికించిన పాల మిశ్రమం కలిపి గిన్నెలోకి తీసి జాజికాయ పొడివేసి ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా వడ్డించాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories