ప్రయాణికుల ప్రాణాలతో ప్రైవేట్ ట్రావెల్స్‌ చెలగాటం..

ప్రయాణికుల ప్రాణాలతో ప్రైవేట్ ట్రావెల్స్‌ చెలగాటం..
x
Highlights

ప్రయాణికుల ప్రాణాలతో ప్రైవేట్ ట్రావెల్స్ చెలగాటమాడుతున్నాయి. కృష్ణాజిల్లా కంచికచర్ల దగ్గర పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో భయంకర నిజాలు...

ప్రయాణికుల ప్రాణాలతో ప్రైవేట్ ట్రావెల్స్ చెలగాటమాడుతున్నాయి. కృష్ణాజిల్లా కంచికచర్ల దగ్గర పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో భయంకర నిజాలు బయటపడ్డాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు పీకలదాక మద్యం తాగి బస్సులు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో బస్సులు నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీవెంకటపద్మావతి, జీవీఆర్ ట్రావెల్స్ , శ్రీకనకదుర్గ ట్రావెల్స్ పై కేసులు నమోదు చేశారు.

అర్థరాత్రి పూట అటవీ ప్రాంతంలో బస్సును నిలిపి.. మీ చావు మీరు చావండి.. ఇక బస్సు ఒక్క ఇంచు కూడా కదలదూ అంటూ డ్రైవర్ మొండికేయడంతో ప్రయాణికులు రాత్రంతా జాగారం చేసుకుంటూ.. బిక్కుబిక్కు మంటూ వెళ్లదీయాల్సి వచ్చింది. ప్రయాణికులు టిక్కట్టు బుక్ చేసుకునే ముందు ట్రావెల్ ఏజెంట్లు చెప్పే కబర్లు.. అన్ని వాస్తవ రూపంలో నీటి బుడగలని తెలిసినా.. అవసరాల నేపథ్యంలో సర్ధుకుపోతున్న ప్రయాణికులపై ప్రతీరోజు ఏదో ఒక రూపంలో ప్రైవేటు ట్రావెల్స్ తమ అరాచకాలను సృష్టిస్తునే వున్నాయి. క్షేమంగా గమ్యానికి చేర్చాలిన బస్సులు ప్రయాణికులను నడిరోడ్డు పైనే వదిలేస్తున్నాయి. నిన్నదీపికా ట్రావెల్స్... నేడు న్యూ ధనుంజయ ట్రావెల్స్... ప్రయాణికులను నడిరోడ్డుపై రాత్రంతా జాగారం చేయించాయి.

హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో విశాఖపట్నం బయల్దేరిన న్యూ ధనుంజయ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ అవుటర్ రింగ్‌ రోడ్డుపైన నిలిచిపోయింది. సరిగ్దా అప్పటి బస్సు బయలుదేరి గంటన్నర కూడా కాలేదు. ఎయిర్ లాక్ అయిందంటూ బస్సును అర్ధంతరంగా నిలిపివేసిన డ్రైవర్ తనకు బాధ్యత లేదన్నట్టు వ్యవహరించాడు. విశాఖ పట్నానికి చేరుకునే క్రమంలో అదీ హైదరాబాద్ దాటిదాటక ముందే ఈ ఘటన జరిగింది. అయినా డ్రైవర్ కానీ, ట్రావెల్స్ యాజమాన్యం కానీ ఏ మాత్రం స్పందించలేదు. హుటాహుటిన వేరే బస్సును పంపించి ప్రయాణికులను సరక్షితంగా గమ్యస్థానాలకు చేరాల్సిన యాజమాన్యం కూడా తమకు పట్టనట్ల వ్యవహరించింది. దీంతో ప్రయాణికులు రాత్రంతా అవుటర్‌పై అవస్థలు పడ్డారు. ట్రావెల్స్ మేనేజ్‌మెంట్‌కి ఫోన్‌ చేసినా కూడా ఎలాంటి స్పందన లేదు. దీంతో రాత్రంతా ప్రయాణికులు ఔటర్ రోడ్డుపై జాగారం చేశారు. అదీనూ చిమ్మచీకటి, అటవీ ప్రాంతానికి ఏమాత్రం తీసిపోని విధంగా వుంటే రోడ్డపై నానా అవస్థలు పడ్డారు. ఇవాళ తెల్లవారు జాము వరకు పరిస్థితి అలానే వుండింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి బస్సు యాజమాన్యంతో చర్చలు జరిపి వేరే బస్సును తెప్పించి ప్రయాణికులను పంపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories