మహర్షి సక్సెస్ మీట్ : కాలర్ ఎగరేసిన మహేష్

మహర్షి సక్సెస్ మీట్ : కాలర్ ఎగరేసిన మహేష్
x
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మహర్షి' సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. తొలి రోజు నుంచి మంచి...

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మహర్షి' సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. తొలి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ముదులుతుంది . ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత దిల్ రాజు, అశ్వినీదత్ ఆదివారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు...

ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ... ''ఈ రోజు చాలా స్పెషల్ డే.. మదర్స్ డే. నాకు అమ్మంటే దేవుడుతో సమానం. ఏ సినిమా రిలీజ్ అవుతున్నా ముందు అమ్మదగ్గరకు వెళ్లి కాఫీ తాగుతాను. ఆ కాఫీ తాగితే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్లు ఉంటుంది. ఆవిడ ఆశీస్సులు నాకు చాలా ముఖ్యం. 'మహర్షి' విజయాన్ని అందరు అమ్మలకు డెడికేట్ చేస్తున్నాను.'' అన్నారు.

దత్ గారు, దిల్ రాజు గారు, పివిపి‌గారి పెద్ద బ్యానర్లు నా 25వ సినిమా ని ప్రొడ్యూస్ చేయడం గర్వంగా ఉంది. ఇంత బిగ్గెస్ట్ హిట్ చేసిన ఆడియెన్స్, ఫ్యాన్స్ కి హ్యాట్సాఫ్. ''వంశీ గురించి ఇప్పటికే చాలా చెప్పాను. ఇపుడు మరో విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ నాన్నగారి అభిమానులు, నా అభిమానులు కాల్ ఎత్తుకుని తిరుగుతారు అన్నాడు. వాళ్లు ఎత్తారు... ఇపుడు నేను కూడా కాలర్ ఎగరేస్తున్నాను'' అని వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories