ఒంగోలు వైసీపీ అభ్యర్థి మార్పు?

Submitted by nanireddy on Sun, 08/26/2018 - 08:40
ongole ycp politics

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని  ఏపీలో ప్రతిపక్ష వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అడుగులు వేస్తోంది. అందులో భాగంగా గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో ఒంగోలు వైసీపీ అభ్యర్థి మార్పు అన్న రూమర్ మొదలయింది. అక్కడ ఇంచార్జి గా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో అయన దాదాపు 20 వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో ఓటమి చెందారు. ఈసారి కూడా బాలినేనిని ఓడిస్తానని దామచర్ల శపధం చేశారు. పైగా బాలినేని సొంత గ్రామం కొణిజేడులో కూడా టీడీపీ జెండా ఎగురవేశారు. ఈ క్రమంలో రోజు రోజుకు బలపడుతున్న దామచర్ల ఈసారి కూడా గెలుస్తారని వైసీపీలోని ఓ వర్గం భావిస్తోందట.దాంతో ఈసారి కాపు సామజికవర్గం లేదా కమ్మ సామజికవర్గం నుంచి ఎవరో ఒకరిని పోటీకి దింపితే ఒంగోలులో వైసీపీ గెలుస్తుందని కొంతమంది నమ్ముతున్నారట.     బాలినేని సొంత సామజిక వర్గం ఓట్లు కేవలం 18 వేలు మాత్రమే ఉన్నాయని. కమ్మలు 32 వేలు, కాపులు 30 వేల పైచిలుకు ఉన్నారని తద్వారా బాలినేని గెలుపు కష్టమన్న అభిప్రాయంలో ఉన్నారట.

అందుకే ఈసారి బాలినేనికి కాకుండా కాపు సామజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇవ్వాలని వైసీపీ అనుకుంటోందట. ఇందులో భాగంగా మాజీ డీజీపీ నండూరి సాంబశిరావు వైసీపీలో చేరేందుకు నిన్న(శనివారం) జగన్ ను కలిశారు. ఆయనకు ఒంగోలు అసెంబ్లీ టికెట్ ఇచ్చి బాలినేనికి  మార్కాపురం, దర్శిలలో ఏదో ఒకటి ఇవ్వాలని అధిష్టానం యోచిస్తోందట. ఒకవేళ సాంబశివరావు కాదంటే మాజీ ఎమ్మెల్యే , టీడీపీ నేత ఈదర హరిబాబును పోటీ చేయించేంచాలని అనుకుంటున్నారట.  ఇదిలావుంటే వచ్చే ఎన్నికల్లో తానే అభిర్దినంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. ఒంగోలు నుంచే పోటీ చేస్తానని అయన స్పష్టం చేస్తున్నారు. ఇక ఈ సందిగ్థత తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. 

English Title
ongole ycp politics

MORE FROM AUTHOR

RELATED ARTICLES