ఈయనో డిఫిరెంట్ .. తేళ్ళు కనిపిస్తే తినేస్తాడు ..

ఈయనో డిఫిరెంట్ .. తేళ్ళు కనిపిస్తే తినేస్తాడు ..
x
Highlights

సహజంగా మనకి తేళ్ళు కనిపిస్తే దూరంగా వెళ్తాం అంతకు మించి అయితే ఏదైనా కర్రతో కట్టి చంపేస్తాం .. కానీ ఈయనో డిఫిరెంట్ తేళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడే...

సహజంగా మనకి తేళ్ళు కనిపిస్తే దూరంగా వెళ్తాం అంతకు మించి అయితే ఏదైనా కర్రతో కట్టి చంపేస్తాం .. కానీ ఈయనో డిఫిరెంట్ తేళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడే తినేస్తాడు . ఇలా ఒక్కటి కాదు రెండు కాదు .. వందల తేళ్ళు తిన్నాడు . పోనీ దాని వల్ల ఆయనని ఏమైనా అయిందా అంటే ఏమి లేదు . దీనిని చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు .. అయన పేరు మాకప్ప అయన ఇరవై ఏళ్ల కింద గుడిసె కప్పుతుండగా ఆయనకు ఓ తేలు కుట్టింది . అప్పుడు వైద్యం చేయించుకున్నాడు . ఇదే క్రమంలో మరోసారి ఆయనని మరో తేలు కుట్టింది . ఈ సారి మాకప్పకి కోప్ప వచ్చి అ తేలును నోట్లో వేసుకొని కొరికి నమిలేసాడు . ఇలా ఓ వంద తేళ్ళును తినేసాడు . తర్వాత వీటినే తినడం అలవాటు చేసుకున్నాడు . ఉళ్ళో ఎక్కడైనా తేలు కనిపిస్తే కూడా గ్రామస్థులు ఆయనకి వెళ్లి చెబుతారు . దీనివల్ల తనకి ఎలాంటి ఇబ్బంది కలగలేదని తన సోదరికి ఓ సారి రక్తం అవసరం ఉంటే ఇచ్చానని మాకప్ప చెబుతున్నాడు . దీనిని ఎవరు ప్రయత్నించ వద్దు అని చెబుతున్నాడు మాకప్ప ..

Show Full Article
Print Article
Next Story
More Stories