చార్మినార్ దగ్గర సిగరెట్ తాగి ఫైన్ కట్టిన హీరో రామ్

చార్మినార్ దగ్గర సిగరెట్ తాగి ఫైన్ కట్టిన హీరో రామ్
x
Highlights

బహిరంగ ప్రదేశంలో సిగరేట్ తాగుతూ హీరో రామ్ పట్టుబడ్డాడు. చార్మినార్‌ వద్ద సిగరేట్ తాగిన హీరో రామ్‌కు పోలీసులు రూ. 200 జ‌రిమానా విధించారు. రామ్ హీరోగా...

బహిరంగ ప్రదేశంలో సిగరేట్ తాగుతూ హీరో రామ్ పట్టుబడ్డాడు. చార్మినార్‌ వద్ద సిగరేట్ తాగిన హీరో రామ్‌కు పోలీసులు రూ. 200 జ‌రిమానా విధించారు. రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తోన్న చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. ఈ
సినిమా చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా చిత్ర యూనిట్ చార్మినార్‌కు చేరుకుంది. చార్మినార్ పర్యాటక ప్రాంతం కావడంతో ప్రభుత్వ ఆదేశాల ప్ర‌కారం ధూమపానం నిషేధం. కానీ ఈ విష‌యం తెలియ‌క షూటింగ్‌లో భాగంగా హీరో రామ్ అక్క‌డ సిగ‌రెట్‌ను కాల్చారు. ఆ ఘ‌ట‌న‌ను ఫోటో తీసిన త‌ర్వాత బ‌హిరంగంగా సిగ‌రెట్ తాగినందుకు పోలీసులు రామ్‌కు రూ. 200 జ‌రిమానా విధించారు. పోలీసులు రామ్‌కు జ‌రిమానా విధించ‌గా రామ్‌ చ‌లానా క‌ట్టారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories