పోషకాలతో కూడిన అరికల ఇడ్లీ తయారీ ఎలా?

పోషకాలతో కూడిన అరికల ఇడ్లీ తయారీ ఎలా?
x
Highlights

చిరుధాన్యాల్లో ఒకటైన అరికెలు పోషకాహారాలు. అరికెల్లో ప్రోటీన్లు 13 గ్రాములు, కొవ్వు 1.1 గ్రాము, కాల్షియం 63.6 మిల్లీ.గ్రాములు, భాస్వరం 244.3...

చిరుధాన్యాల్లో ఒకటైన అరికెలు పోషకాహారాలు. అరికెల్లో ప్రోటీన్లు 13 గ్రాములు, కొవ్వు 1.1 గ్రాము, కాల్షియం 63.6 మిల్లీ.గ్రాములు, భాస్వరం 244.3 మిల్లీ.గ్రాములు ఇనుము 1.6 గ్రాములు ఉంటాయి.

కావల్సిన పదార్ధాలు :

అరికలు : 100 గ్రాములు

మినపప్పు : 100 గ్రాములు

ఇడ్లీ రవ్వ : 100 గ్రాములు

ఉప్పు : సరిపడినంత

తయారీ విధానం :

ముందుగా అరికలు, మినపప్పు, ఇడ్లీరవ్వలు మూడింటిని వేరువేరుగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన అరికలు, మినపప్పు రెండింటిని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఇడ్లీ రవ్వను వేసి ఒక రాత్రి ఉంచాలి. తరువాత రోజు ఆ మిశ్రమంలో ఉప్పు కలిపి ఇడ్లీలు వేసుకోవాలి..ఎంతో ఆరోగ్యవంతమైన, పోషకాలతో కూడిన అరికల ఇడ్లీ రెడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories