ఈ ఎన్నికల్లో టీడీపీ బాక్సులు గల్లంతు కావడం ఖాయం: జీవీఎల్‌

ఈ ఎన్నికల్లో టీడీపీ బాక్సులు గల్లంతు కావడం ఖాయం: జీవీఎల్‌
x
Highlights

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన రాజకీయంగా ఇంకా మాటల తూటలతో హీటేక్కుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఈవీఎంలకు వ్యతిరేకంగా చేపట్టిన...

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన రాజకీయంగా ఇంకా మాటల తూటలతో హీటేక్కుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఈవీఎంలకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఘాటుగా స్పందించారు. బాబు చేపట్టిన కార్యక్రమం ఫెయిల్ అయిందని అన్నారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా బాబు చెబుతున్న విషయాలను ఇతర పార్టీలు నమ్మడం లేదని అందుకే కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో చేపట్టిన కార్యక్రమానికి కేవలం 3 పార్టీలు మాత్రమే హాజరయ్యాయని జీవీఎల్ అన్నారు.టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చాలా ఫ్రస్టేషన్‌లో ఉన్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నర్సింహారావు విమర్శించారు. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో నారా చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకోందని అందుకే ఢిల్లీ చుట్టు తిరుగుతున్నరని అన్నారు. ఆదివారం జీవీఎల్‌ న్యూఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జీవీఎల్‌ మాట్లాడుతూ ఇప్పుడు ఈవీఎంను తప్పుబడుతున్న బాబు మరీ గత 2014 ఎన్నికల్లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.అసలు అధికారులను బదిలీ చేస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నరని అన్నారు. ఏపీలో మూడు కోట్లమంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. వారికి రాని అనుమానం బాబుకు మాత్రమే ఎందుకు వచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ బాక్సులు గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఓ పరిపక్వత గల రాజకీయ నాయకుడు అలా ప్రవర్తించరాదని, చంద్రబాబు నలభై ఏళ్ల అనుభవం ఎందుకని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories