సజీవ సమాధికి సిద్ధపడ్డ వృద్ధుడు...ఎందుకో తెలుసా...

Submitted by arun on Fri, 07/27/2018 - 14:38

గుంటూరు జిల్లాలో ఓ వృద్ధుడు సజీవ సమాధికి సిద్ధపడ్డాడు. సమాజంలో కుళ్లు కుతంత్రాలు పెరిగిపోయాయని, అంతటా దుర్మార్గమే రాజ్యమేలుతోందంటూ ఆవేదనకు గురైన లచ్చిరెడ్డి సజీవ సమాధి కావడం కోసం తన పొలంలో నేలమాళిగ సమాధిని కట్టించుకున్నాడు. సమాజంలో అన్యాయం చూడలేకే సజీవ సమాధికి సిద్ధపడ్డానంటున్న వృద్ధుడి మాటలు సంచలనంగా మారాయి. 

మాచర్ల మండలం గన్నవరంలో కుటుంబానికి దూరంగా ఉంటోన్న లచ్చిరెడ్డి గత పదేళ్లుగా ఆధ్యాత్మిక బాటలో పయనిస్తున్నాడు. అయితే సమాజంలో కళ్లు, కుతంత్రాలు, దుర్మార్గం పెరిగిపోతుందని ఆవేదనకు గురైన లచ్చిరెడ్డి సజీవ సమాధి ద్వారా తనువు చాలించాలని భావించాడు. అనుకున్నదే తడువుగా తన సొంత పొలంలో నేలమాళిగ కట్టించుకున్న లచ్చిరెడ్డి సజీవ సమాధికి అనుమతి ఇవ్వాలంటూ గుంటూరు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశాడు. కలెక్టర్‌ జోక్యంతో రంగంలోకి దిగిన పోలీసులు వృద్ధుడి ప్రయత్నాన్ని అడ్డుకొన్నారు. అనంతరం కౌన్సిలింగ్‌ ఇచ్చి లచ్చిరెడ్డిని పోలీసులకు అప్పగించారు.   

English Title
old man try buried alive

MORE FROM AUTHOR

RELATED ARTICLES