జేసీ దివాకర్ రెడ్డికి క్లీన్ చిట్

జేసీ దివాకర్ రెడ్డికి క్లీన్ చిట్
x
Highlights

జేసీ దివాకర్‌ రెడ్డికి తాడిపత్రి ఆర్వో ప్రభాకర్‌ రెడ్డి క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. ఎన్నికల వ్యయంపై జేసీ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. ఎన్నికల...

జేసీ దివాకర్‌ రెడ్డికి తాడిపత్రి ఆర్వో ప్రభాకర్‌ రెడ్డి క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. ఎన్నికల వ్యయంపై జేసీ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని జేసీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. దీంతో జేసీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఆర్వోని జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌ ఆదేశించారు. ఈ క్రమంలో విచారించిన ఆర్వో జేసీ వ్యాఖ్యల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘన లేదని తేల్చి చెప్పారు.

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ధన ప్రవాహం పెరిగిపోయిందని, ఏపీలో అన్ని పార్టీలు రూ. 10వేల కోట్లు ఖర్చు చేశాయని, పోటీలు పడి పార్టీలు ఖర్చు పెట్టాయని, మొదట్లో పోటీకి రూ. లక్ష, రెండోసారి రూ. 25 లక్షలు, ఇప్పుడు రూ. 25 కోట్లు లేకుంటే పోటీ చేసే పరిస్థితి లేదని జేసీ వ్యాఖ్యానించారు. ఇక దీనిపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘించారని ఆరోపించారు. దీనిపై జేసీ వివరణ కూడా ఇచ్చారు. ఇక ఈ ఎన్నికల్లో తాను రూ. 50 కోట్లు ఖర్చు చేశానని ఎక్కడా చెప్పలేదని నివేదిక ఇచ్చారు. ఇతరులను ఉద్దేశించి సార్వత్రిక వ్యాఖ్య మాత్రమేనని స్పష్టీకరించారు. అయితే జేసీ దివాకర్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయలేదని, ఎవరి పేరు నేరుగా ప్రస్తావించలేదని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన పరిధిలోకి రాదని ఆర్వో తన నివేదికలో స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories