నిలబడి నీరు తాగుతున్నారా...? తస్మాత్ జాగ్రత్త

నిలబడి నీరు తాగుతున్నారా...? తస్మాత్ జాగ్రత్త
x
Highlights

పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అనేది సామెత వరకే వర్తిస్తుంది.. కానీ నిలబడి నీళ్లు తాగితే చాలా డేంజర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు....

పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అనేది సామెత వరకే వర్తిస్తుంది.. కానీ నిలబడి నీళ్లు తాగితే చాలా డేంజర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగితే మంచిదని తెలుసుగానీ నిలబడి తాక్కూడదని తెలియదు చాలా మందికి...నిలబడి నీళ్లు తాగితే ఆరోగ్యపరంగా చాలా దుష్ర్పభావాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

నీళ్లు నిలబడి తాగడం వల్ల కిడ్నీలకు నీరు అందదు.. దాంతో కిడ్నీ, మూత్రాశయ సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది.

ఆహార నాళం గుండా జీర్ణాశయంలోకి ఒక్కసారిగా వచ్చి నీరు చేరతాయి. తద్వారా జీర్ణాశయం గోడలపై నీరు ఒకేసారి చిమ్మినట్లవుతుంది. దీని వల్ల అత్యంత సున్నితంగా ఉండే జీర్ణాశయం గోడలు దెబ్బ తింటాయి. జీర్ణాశయం గోడలు దెబ్బతింటే..ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి నిలబడి నీళ్లు తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు... చాలామంది బఫే సిస్టమ్ అంటూ నిలబడి భోజనం చేయడం కూడా జరుగుతూ వుంది. ఇది కూడా ఆరోగ్యానికి హాని కలిగించే అలవాటు అంటున్నారు. ఈ రెండింటినీ కూర్చుని మాత్రమే చేయాలని ఆయుర్వేదం సూచిస్తోంది. ఐతే ఈ రోజుల్లో చాలామంది నిలబడే నీళ్లు, భోజనం లాగించేస్తున్నారు. ఈ అలవాటుని మార్చుకుని ఈ రెండింటినీ కూర్చుని చేస్తే ఆరోగ్యకరం

Show Full Article
Print Article
More On
Next Story
More Stories