నిపా వైరస్‌ సంక్రమించేది ఇలాగే.. నిర్లక్ష్యం వహిస్తే..

నిపా వైరస్‌ సంక్రమించేది ఇలాగే.. నిర్లక్ష్యం వహిస్తే..
x
Highlights

నిపా వైరస్‌ ఇప్పుడిదే పేరు దేశాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. వ్యాధి భారిన పడిన పందులు గబ్బిలాలు వంటి జంతువుల ద్వారా వచ్చేదే ఈ వైరస్..దీనిదాటికి...

నిపా వైరస్‌ ఇప్పుడిదే పేరు దేశాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. వ్యాధి భారిన పడిన పందులు గబ్బిలాలు వంటి జంతువుల ద్వారా వచ్చేదే ఈ వైరస్..దీనిదాటికి ఇప్పటికే భారత్ లో పది మందికిపైగానే మరణించినట్టు అధికారికంగా తెలుస్తోంది. కేరళలోని ముగ్గురు వ్యాధిగ్రస్థులకు చికిత్స అందించిన డాక్టర్లు వారికీ నిపా వైరస్‌ సోకినట్టు వెల్లడించారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ వైరాలజీ విశ్లేషణ ప్రకారం.. నిపా వైరస్ మనుషులు , పశువులకు గాలి లేదా లాలాజలం ద్వారా సోకే జునోటిక్ దీన్ని భారత్ లో మొదట కేరళలో కనుగొన్నారు. అంతేకాకుండా పందులు, గబ్బిలాలు తిని వదేలేసిన పండ్లకు ఇది సంక్రమిస్తుందని ఇండియన్ జర్నల్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. దీన్ని మొదట్లో మలేషియాలోని సుంగాయ్ నిపా గ్రామంలో 1998లో తొలిసారిగా గుర్తించారు. ఆ తరువాత ఇది సింగపూర్‌ కు వ్యాపించింది..1998-1999 మధ్య సుమారు 100మంది వరకు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా ఆ సమయంలో సుమారు పది లక్షల పందులు ఈ వైరస్ భారినపడ్డాయి క్రమంగా అవి మృతిచెందాయి.

వ్యాధి లక్షణాలు:
నిపా వైరస్‌ సోకిన బాధితులకు 7 నుంచి 14 రోజుల మధ్యలో దీని తీవ్రత తెలుస్తుంది. ఈ వ్యాధిగ్రస్తుల్లో ముఖ్యంగా తీవ్రమైన జ్వరం, శ్వాససంబంధ సమస్యలు, అపస్మారక స్థితి, తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, అలసట, దృష్టి లోపించడం వంటి లక్షణాలు ఉంటాయి. వ్యాధి ముదిరితే.. ఎన్‌సెఫలైటిస్ కారణంగా రోగి కోమాలోకి వెళ్లే అవకాశముంది.కాగా ఈ వ్యాధిగ్రస్తులకు కేరళలో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.

తీసుకోవలసిన జాగ్రత్తలు :
ఈ వ్యాధి దరిచేరకుండా చుట్టుపక్కల పరిసరప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పందులు, గబ్బిలాలు మరియు ఇతర అపరిశుభ్ర జంతువులను ధరిచేరనీయకూడదు. ఎవరికైనా పై లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

మహిళ మృతి:
ఇదిలావుంటే నిపా వైరస్‌ సోకి కేరళకు చెందిన లినీ(31) కన్నుమూశారు. అయితే ఆమె మరణానికి కొద్దిగంటల ముందు తన భర్తకు లేఖ రాసింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. 'నేను చనిపోబోతున్నానని నాకు తెలుసు. నిన్ను కలుసుకునే సమయం లేదని కూడా తెలుసు. మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. నీతో పాటు వాళ్లను గల్ఫ్‌కు తీసుకెళ్లు. నేనులేను అని మా నాన్నగారిలానే జీవితాంతం ఒంటరిగా ఉండకు' అంటూ మరణశయ్యపై నిపా వ్యాధి గ్రస్తురాలు లేఖ రాసింది. అది చూసిన పలువురికి కంటనీరు తెప్పించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories