బాబాయ్ పిలవలేదు..

Submitted by arun on Wed, 04/04/2018 - 12:09

ఐపీఎల్ తెలుగు బ్రాండ్ అంబాసిడర్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎల్ ప్రమోషన్ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రికెట్‌తో తనకున్న అనుభవాన్ని షేర్ చేసుకున్న ఎన్టీఆర్.. ఇదే వేదికపై మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ముఖ్యంగా త్వరలో బాలయ్య తెరకెక్కించబోతున్న ‘ఎన్టీఆర్ బయోపిక్’ గురించి ఆయన తెలిపారు.

మీరు ‘ఎన్టీఆర్ బయోపిక్’ సినిమాలో ఏ పాత్ర అయినా చేయాలని అనుకుంటున్నారా? మొన్న ఓపెనింగ్ కు ఎందుకు రాలేదు అనే ప్రశ్నలు ఎదురైనప్పుడు.. ''ఇంతవరకు నాకు ఎలాంటి సమాచారం అయితే అందలేదు. ఒక వేళ నా వరకు వస్తే తప్పకుండా మీకు చెబుతాను'' అని ఎన్టీఆర్ సమాధానం ఇచ్చారు. ఇంతకుముందు బయోపిక్ లపై నటించే అవకాశం ఏమైనా ఉందా అని అంటే.. అలాంటి వాటిలో నటించాలంటే కొంచెం కష్టం. జాతీయ స్థాయి నటీనటుల తరహాలో నటించాలంటే బయమని తారక్ వివరించాడు. 
 

English Title
NTR Gives Clarity on about NTR-Biopic

MORE FROM AUTHOR

RELATED ARTICLES