మరో అభ్యర్థిని మార్చేసిన జగన్..

Submitted by nanireddy on Thu, 09/20/2018 - 20:20
now narasaraopeta ycp incharge is laavu srikrishnadevarayulu

వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్షంగా వైసీపీ అడుగులేస్తోంది. ఈ క్రమంలో పార్టీ బలహీనంగా ఉన్న చోట సీరియస్ గా దృష్టి సారించింది.విజయవాడ సెంట్రల్ లో వంగవీటి రాధా పోటీ చేస్తే గెలుపు కష్టమేనన్న అభిప్రాయంతో అక్కడ మల్లాది విష్ణును రంగంలోకి దించింది. అలాగే గుంటూరు పార్లమెంటు బరిలో కూడా ప్రస్తుత అభ్యర్థిని మార్చి మరోచోటకు పంపించింది. ప్రస్తుతం గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్ ఉన్నారు. ఇక వైసీపీకి అక్కడ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇంచార్జి గా ఉన్నారు. వీరిద్దరూ కమ్మ సామజిక వర్గానికి చెందిన వారు కావడం, గుంటూరు పార్లమెంటు పరిధిలో కమ్మ సామజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉండగా.. వారందరు టీడీపీ వైపు మొగ్గు చూపితే తమ పార్టీకి నష్టమని భావిస్తోంది వైసీపీ. దాంతో అక్కడ కమ్మ వర్గం నుంచి కాకుండా కాపు సామజిక వర్గం నుంచి అభ్యర్థిని నిలబెడితే కాపు ఓటర్లను ఆకర్షించవచ్చనే ఉద్దేశ్యంతో అక్కడ శ్రీకృష్ణదేవరాయలును కాదని మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారు రోశయ్యను ఇంఛార్జిగా నియమిస్తోంది వైసీపీ. ఇక శ్రీకృష్ణ దేవరాయులును నరసారావుపేట పార్లమెంటుకు పంపించింది. 2014 ఎన్నికల్లో అక్కడినుంచి ప్రముఖ వ్యాపారవేత్త ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి ని బరిలోకి దించింది వైసీపీ. రాయపాటి సాంబశివరావు చేతిలో 20వేల పైచిలుకు ఓట్లతో అయోధ్య రామిరెడ్డి ఓటమి చవిచూశారు. ఇక 2019 లో ఈ సీన్ రిపీట్ కాకుండా ఉండటానికి అదే సామజిక వర్గానికి చెందిన.. కాస్తో కూస్తో పలుకుబడి ఉన్న లావు కుటుంబానికి చెందిన శ్రీకృష్ణదేవరాయులును వైసీపీ అధిష్టానం ఫైనల్ చేసింది.

English Title
now narasaraopeta ycp incharge is laavu srikrishnadevarayulu

MORE FROM AUTHOR

RELATED ARTICLES