ఆ ఫ్యామిలీలో అందరూ దొంగలే...

ఆ ఫ్యామిలీలో అందరూ దొంగలే...
x
Highlights

వారు రెక్కి వేస్తే ఏదైనా జరగాల్సిందే. పగలనే భయం లేదు .. రాత్రనే ఆందోళన లేదు ... కంటికి కనపడింది దోచుకోవడం .. గుట్టుగా దాచుకోవడం వారి పని. దొంగల బండిలా...

వారు రెక్కి వేస్తే ఏదైనా జరగాల్సిందే. పగలనే భయం లేదు .. రాత్రనే ఆందోళన లేదు ... కంటికి కనపడింది దోచుకోవడం .. గుట్టుగా దాచుకోవడం వారి పని. దొంగల బండిలా మారిన దొంగల ఫ్యామిలి అది. పోలీసుల హైటెక్ పరిజ్ఞానానికి సైతం దొరకకుండా చేయడం ఈ ఫ్యామిలీ ట్రెండ్. 5 కిలోల బంగారం .. 12న్నర కిలోల వెండి ..భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలు ... రెండు కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు

మినీ జ్యూవెలరీ షాప్‌ని తలపిస్తున్న ఇదంతా హైదరాబాద్‌లో ఓ దొంగల ఫ్యామిలీ దోచేసిన ప్రజల సంపద ఇది. ఇటీవల పాత నేరస్తుల దగ్గర్నుండి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ వరకు డేటాను సేకరించి నేరస్తులపని పడుతుండగా పోలీసులకు వీరి ఆచూకి లభించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండతో పోలీస్ కమీషనరేట్ల పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న 11 మంది సభ్యుల దొంగల ముఠాను సిటీ నార్త్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సికింద్రాబాద్ గోపాలపురం అడ్డాగా దోపిడీలకు పాల్పడుతున్న ఈ ముఠా మొత్తం 11మంది సభ్యులున్నారు. వీరిలో తొమ్మిది మంది ఒకే కుటుంబ సభ్యులు. వీరంతా దొంగతనాలు చేయడంలో ఆరితేరారు. ఎక్కడ చోరి చేయాలో ఒకరు చెబితే ..ఎలా చోరి చేయాలో మరొకరు .. ఏం టైంలో చేయాలో ఇంకొకరు ఇలా ఎవరికి వారే ప్లాన్ వేసి రంగంలోకి దిగడం .. మూడో కంటికి తెలియకుండా చాపచుట్టేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. దొంగతనాలు చేసే సమయంలో సీసీ కెమెరాలకు చిక్కకుండా సీసీ కెమెరాల కేబుల్స్ కట్ చేయడం, DVR ను ఆఫ్ చేసి తమ గురించి జాగ్రత్తపడతారు..

ఈ బ్యాచ్ హైదారబాద్ తో పాటు తెలంగాణా జిల్లాల్లో పలు చోరీలు చేసి కోట్ల రూపాయలు కూడగట్టింది. చోరీల ద్వారా వచ్చిన డబ్బుతో నేరెడ్ మెట్ లో కృప దీప అపార్ట్ మెంట్ లో ఓ సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కొనుగోలు చేశారు. అరెస్ట్ కావడం బెయిలు పై బయటకు రావడం మళ్ళీ ఇళ్ళను లూఠీ చేయడం సర్వ సాధారణంగా మారింది. ఇప్పటి వరకు 34 కేసుల్లో నిందితులుగా ఉన్న వీరు హైదారాబాద్‌లో 19 , సైబరాబాద్‌లో 7 , రాచకొండలో 8 చోట్ల చోరీలు చేశారు. ఇటీవల సికింద్రాబాద్ గోపాలపురంలో జరిగిన చోరీ కేసులో ఫింగర్‌ ప్రింట్‌ల ఆధారంగా బండారం బయటపడింది. వీరి అరెస్ట్‌తో నగరంలో వరుస చోరీలకు అడ్డుకట్టపడినట్టేనని పోలీసులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories