తిరుమలలో మరో అపచారం

Submitted by arun on Mon, 07/02/2018 - 10:36

తిరుమల పుణ్యక్షేత్రంలో మరోసారి అపచారం చోటు చేసుకుంది. జీఎన్‌సీ టోల్‌గేట్‌ నుంచి వెళ్లే రింగ్‌రోడ్డుపై కోడిమాంసం చెల్లాచెదురుగా పడి ఉంది. అందులోనూ గరుడ పోలీసు విశ్రాంతి భవనం ముందే మాంసం పడిఉండటం భక్తులను మరింత విస్మయానికి గురి చేసింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 

శ్రీవేంకటేశ్వరస్వామి వెలసిన తిరుమల క్షేత్రంలో మద్యం, మాంసం, పొగాకు ఉత్పత్తుల విక్రయం, వాడకం నిషేధం. అయితే గుర్తుతెలియని వ్యక్తులు అలిపిరి తనిఖీలలో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మాంసాన్ని తిరుమలకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఓ ప్లాస్టిక్‌ కవరు చిరిగి అందులో నుంచి మాంసం ముక్కలు చెల్లాచెదురుగా రోడ్డుపై పడ్డాయి. స్థానికంగా నివాసముండే వారు ఈ మాంసాన్నితీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 
 
శ్రీవారి దర్శనార్థం ఆ మార్గం ద్వారా వాహనాల్లో వెళ్లిన భక్తులు రోడ్డుపై మాంసాన్ని చూసి ఆశ్చర్యపోయారు. పోలీసులకు సమాచారమివ్వటంతో ఆ మాంసాన్ని రోడ్డుపై నుంచి తొలగించారు. మాంసాన్ని ఎవరు తీసుకొచ్చారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. అలిపిరిలో భద్రతా తనిఖీలు నిర్లక్ష్యంగా ఉండటంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

English Title
Non Veg Found in Tirumala

MORE FROM AUTHOR

RELATED ARTICLES