తెలంగాణలో జోరందుకున్ననామినేషన్లు

తెలంగాణలో జోరందుకున్ననామినేషన్లు
x
Highlights

రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల పర్వం జోరందుకుంది. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో నామినేషన్ల సందడి నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు పలువురు...

రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల పర్వం జోరందుకుంది. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో నామినేషన్ల సందడి నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు పలువురు ప్రముఖులు నామినేషన్లు దాఖలు చేశారు. గజ్వేల్‌లో కేసీఆర్‌, సిద్దిపేటలో హరీష్‌రావు నామినేషన్లు వేయగా, భూపాలపల్లిలో మధుసూదనాచారి, చెన్నూరులో బాల్క సుమన్‌, తాండూరులో పట్నం మహేందర్‌రెడ్డి, జడ్చర్లలో లక్ష్మారెడ్డి, మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్‌గౌడ్‌, అచ్చంపేటలో గువ్వల బాలరాజు, మక్తల్‌లో చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, గద్వాలలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌లో బిగాల గణేష్ గుప్తా, ములుగులో చందులాల్, కరీంనగర్‌లో గంగుల కమలాకర్, వర్ధన్నపేటలో ఆరూరి రమేష్, హుస్నాబాద్‌లో సతీష్‌కుమార్‌, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్‌, ఖానాపూర్‌లో రేఖానాయక్, మహబూబాబాద్‌లో శంకర్‌‌నాయక్‌, జహీరాబాద్‌‌లో మాణిక్ రావు, పరిగిలో కొప్పుల మహేష్‌రెడ్డి, కోరుట్లలో కల్వకుంట్ర విద్యాసాగర్‌‌రావు దేవరకద్రలో వెంకటేశ్వర్‌రెడ్డి, నామినేషన్లు దాఖలు చేశారు.

ఇక కాంగ్రెస్‌లోనూ నామినేషన్లు స్పీడందుకున్నాయి. ఇప్పటివరకు 75మంది అభ్యర్ధులను ప్రకటించడంతో వాళ్లంతా నామినేషన్లు వేసుకుంటున్నారు. సిరిసిల్లలో కేకే మహేందర్‌రెడ్డి, మంథనిలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి, నారాయణఖేడ్‌లో సంజీవరెడ్డి, పటాన్‌చెరులో శశికళ యాదవరెడ్డి, రామగుండంలో మక్కన్ సింగ్ నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే కాంగ్రెస్‌ మిత్రపక్షమైన టీడీపీ నుంచి మహబూబ్‌నగర్‌లో ఎర్ర శేఖర్‌ నామినేషన్ వేశారు.బీజేపీలోనూ నామినేషన్ల సందడి నెలకొంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ నామినేషన్ దాఖలు చేయగా, ఆందోల్‌లో బాబూమోహన్‌, కరీంనగర్‌లో బండి సంజయ్‌కుమార్‌, మల్కాజ్‌గిరిలో రామచంద్రరావు, పెద్దపల్లిలో గుజ్జల రామకృష్ణారెడ్డి, భూపాలపల్లిలో కీర్తిరెడ్డి, మేడ్చల్‌లో కొంపల్లి మోహన్‌రెడ్డిలు నామినేషన్లు వేశారు.ప్రధాన పార్టీలతోపాటు ఇండిపెండెంట్లు, రెబల్స్‌ కూడా పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల సందడి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories