మధ్యప్రదేశ్‌లో దారుణం...తల్లి మృతదేహాన్ని బైక్‌పై ఆస్పత్రికి తరలించిన కొడుకు

మధ్యప్రదేశ్‌లో దారుణం...తల్లి మృతదేహాన్ని బైక్‌పై ఆస్పత్రికి తరలించిన కొడుకు
x
Highlights

ఒక యువకుడు తన తల్లి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం బైక్ మీద 35 కిలో మీటర్ల దూరంలోని ఆస్పత్రికి తీసుకెళ్లిన హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది....

ఒక యువకుడు తన తల్లి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం బైక్ మీద 35 కిలో మీటర్ల దూరంలోని ఆస్పత్రికి తీసుకెళ్లిన హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. టికమ్ గఢ్ జిల్లాలోని మస్తాపుర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడు తల్లి శవాన్ని బైక్ పై తీపుకెళ్తున్న దృశ్యాలు వైరల్‌గా మారడంతో అధికార యంత్రాంగం, పోలీస్ శాఖపై విమర్శలు వెల్లువెత్తాయి.

మధ్యప్రదేశ్‌లో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. పోస్టుమార్టం కోసం ఆస్పత్రి సిబ్బంది వాహనాన్ని నిరాకరించడంతో తన తల్లి శవాన్ని బైక్‌పై తరలించాడు ఓ వ్యక్తి. మస్తాపూర్‌ గ్రామానికి చెందిన కున్వర్‌ భాయ్‌ అనే మహిళ గత ఆదివారం పాముకాటుకు గురైంది. దీంతో ఆమెను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టానికి తరలించాల్సిందిగా సూచించారు.

పోస్టుమార్టం కోసం వాహన సదుపాయాన్ని కల్పించాల్సిందిగా కున్వర్‌ భాయ్‌ కుమారుడు రాజేశ్‌ ఆస్పత్రి సిబ్బందిని కోరాడు. దీనికి సిబ్బంది నిరాకరించడంతో గత్యంతరం లేక తన బైక్‌పై తల్లి శవాన్ని 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోస్టుమార్టం సెంటర్‌కు తరలించాడు. ఈ ఘటనను స్థానిక ప్రజలు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇప్పడా వీడియో వైరల్‌ అయింది.

ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్‌ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆమెను సకాలంలో ఆసుపత్రికి తరలిస్తే బతికేదన్నారు. పాము కాటేసిన తర్వాత నయమవుతుందనే ఆశతో తన తల్లిని రాజేశ్ ముందు దేవాలయానికి తీసుకెళ్లాడని, ఆ తర్వాతే ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు జిల్లా కలెక్టర్ చెప్పుకొచ్చారు. 108కి ఫోన్ చేసి ఉంటే అంబులెన్స్ వచ్చేదనీ కానీ అలా చేయలేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories