సినిమాలు బంద్.. ఎంటర్ టైన్ మెంట్ మిస్!

సినిమాలు బంద్.. ఎంటర్ టైన్ మెంట్ మిస్!
x
Highlights

డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు.. సినిమా నిర్మాతలకు మధ్య జరుగుతున్న వార్.. ఎంటర్ టైన్ మెంట్ ను కోరుకునే వాళ్లకు ఇబ్బందిగా మారింది. వీకెండ్ లో అలా...

డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు.. సినిమా నిర్మాతలకు మధ్య జరుగుతున్న వార్.. ఎంటర్ టైన్ మెంట్ ను కోరుకునే వాళ్లకు ఇబ్బందిగా మారింది. వీకెండ్ లో అలా ఫ్యామిలీతోనో, స్నేహితులతోనో కలిసి సరదాగా సినిమా చూసి వద్దామని అనుకునే వాళ్లకు.. మూసి ఉన్న థియేటర్లు.. పో పొమ్మని రిటర్న్ పంపించేస్తున్నాయి. దీంతో.. వచ్చే వారినికైనా ఈ గొడవ సద్దు మణుగుతుందా అని సినిమా ప్రేక్షకులు వాపోతున్నారు.

కానీ.. గతంలో రీళ్లతో సినిమాలు ప్రదర్శించినపుడు.. వారానికి 2 వేలకు మించి భారం పడకపోయేదని నిర్మాతలు చెబుతున్నారు. ఇప్పుడు డిజిటల్ ప్రొవైడర్లు చేస్తున్న వసూళ్లతో.. వారానికి 12 వేల రూపాయలకు పైగా భారం పడుతోందని చెబుతున్నారు. ఇది థియేటర్లకు ఇబ్బందిగా మారిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చార్జీలు పెంచడం.. డిజిటల్ ప్రొవైడర్లకు ఎంత మాత్రం సమంజసం కాదని కూడా చెప్పారు.

అందుకే.. విధిలేని పరిస్థితుల్లోనే సమ్మె చేసి.. థియేటర్లు మూసేస్తున్నట్టు నిర్మాతల జాయింట్ యాక్షన్ కమిటీ చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దక్షిణ భారతదేశమంతా ఈ సమ్మెకు అండగా నిలిచింది. ఈ గొడవ ఇంకెన్నాళ్లు నడుస్తుందో.. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో… అని నిట్టూర్చడం సామాన్య ప్రేక్షకుల వంతు అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories