ఏపీ కేబినెట్‌ సమావేశంపై ఉత్కంఠ!

ఏపీ కేబినెట్‌ సమావేశంపై ఉత్కంఠ!
x
Highlights

కేబినేట్‌ భేటీ పై సీఎంవో పంపించిన నోట్‌పై ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమాలోచనలు జరుపుతున్నారు. తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదితో...

కేబినేట్‌ భేటీ పై సీఎంవో పంపించిన నోట్‌పై ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమాలోచనలు జరుపుతున్నారు. తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదితో సమావేశం అయ్యారు. కేబినేట్‌ మీటింగ్‌ సాధ్యాసాధ్యాలపై చర్చ జరుపుతున్నారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ నిబంధనలను పరిశీలిస్తున్నారు. అంతకుముందు సీఎం కార్యదర్శి సాయి ప్రసాద్‌, జీఏడీ పొలిటికల్‌ కార్యదర్శి శ్రీకాంత్‌తో సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమావేశం అయ్యారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో కేబినేట్‌ భేటీ నిర్వహణపై చర్చ జరిపారు. ఈ భేటీ వివరాలను కూడా సీఎస్ ద్వివేదితో భేటీ సందర్భంగా వివరించారు.

ఈ నెల 10 న ఉదయం పది గంటలా 30 నిమిషాలకు కేబినెట్ మీటింగ్ పెట్టాలంటూ ఏపీ సీఎస్‌కు సీఎంఓ లేఖ పంపింది. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ పేరుపై నోట్‌ అందింది. ఫొని తుపాను సహాయక చర్యలు, నష్టపరిహారం, ఖరీఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌, తాగునీటి ఇబ్బందులు తదితర అంశాలపై అజెండా సిద్ధం చేయాలని సీఎంఓ కోరింది. అంతేకాకుండా సీఎం చంద్రబాబు ఇప్పటికే కేబినెట్ మీటింగ్ పెట్టితీరతామని చెప్పారు. దీనిపై సీఎంఓ నుంచి నోట్ అందడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సీఎంఓ నోట్‌పై సీఎస్ ఎలా స్పందిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories