చంద్రబాబు, కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన మోడీ

Submitted by arun on Sat, 07/21/2018 - 10:23
modi

అవిశ్వాసంపై చర్చ సందర్భంగా రాష్ట్ర విభజన, టీఆర్‌ఎస్, టీడీపీ ప్రభుత్వాల తీరుపై మోడీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌‌పై మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. విభజన సమస్యల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎంతో పరిణతితో వ్యవహరించిందన్నారు. చంద్రబాబు, కేసీఆర్ మధ్య అనేకసార్లు సయోధ్య కుదిర్చినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసల వర్షం కురిపించారు. టీడీపీ అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో కీలక వ్యాఖ్యలు చేసిన మోడీ విభజన సమస్యల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎంతో పరిణతితో వ్యవహరించిందని కితాబిచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ అభివృద్ధిపై దృష్టిపెట్టి పాలనను పరుగులు పెట్టిస్తుంటే ఏపీ ప్రభుత్వం, టీడీపీ రోజూ ఏదో ఒక పేచీ పెట్టి ఇబ్బంది పెట్టేదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య అనేక సమస్యలు వచ్చాయన్న మోడీ ఎన్నోసార్లు చంద్రబాబుకి, కేసీఆర్‌కి సర్దిచెప్పాల్సి వచ్చిందన్నారు. తాను, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, గవర్నర్ నర్సింహన్‌‌‌ అనేకసార్లు చంద్రబాబు, కేసీఆర్ మధ్య సయోధ్య కుదిర్చినట్లు చెప్పారు. ఇరువురిని శాంతింపజేసేందుకు తాను ఎన్నోసార్లు ప్రయత్నించానని, అయితే ఆ సమయంలో టీఆర్‌ఎస్‌ ఎంతో పరిణతితో వ్యవహరించిందంటూ కేసీఆర్‌‌‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

టీడీపీ నాయకత్వం తన బలాన్నంతా తెలంగాణకు వ్యతిరేకంగా మోహరించేదని సంచలన వ్యాఖ్యలు చేసిన మోడీ నాటినుంచి నేటివరకు తెలుగుదేశం అదే చేస్తూ వస్తోందన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఎంతో పరిణతి వ్యవహరిస్తూ అభివృద్ధిపైనే దృష్టిపెట్టి ముందుకెళ్తోందన్నారు. కానీ ఏపీలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసంటూ చంద్రబాబును టార్గెట్ చేశారు మోడీ. అయితే మోడీ వ్యాఖ్యలపై మండిపడుతున్న టీడీపీ నేతలు టీఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పందంతోనే కేసీఆర్‌‌పై పొగడ్తల వర్షం కురిపించారని ఆరోపిస్తున్నారు. 

English Title
No-Confidence Motion: PM Narendra Modi

MORE FROM AUTHOR

RELATED ARTICLES