తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి చిచ్చు రాజేసిన అవిశ్వాస తీర్మానం

Submitted by arun on Sat, 07/21/2018 - 12:39
babukcr

కేంద్రంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి చిచ్చు రాజేసింది. చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీలు ప్రస్తావించిన అంశాలపై టీఆర్ఎస్ సభ్యులు భగ్గుమన్నారు.  విభజనకు ముందు మద్ధతిచ్చిన చంద్రబాబు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు. విభజన సమస్యలను ప్రస్తావిస్తూ ప్రధాని చేసిన వ్యాఖలు కూడా ఇరు పార్టీల మధ్య  వివాదాన్ని స్పష్టించాయి.  

అవిశ్వాసతీర్మానంపై పార్లమెంట‌్‌లో చర్చ సందర్భంగా ఎంపీ గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ అశాస్త్రీయ, రాజ్యంగ విరుద్ధంగా ఏపీని విభజించారంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రగల్చాయి. జయదేవ్ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ నేతలు ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.  చర్చలో భాగంగా ప్రసంగించిన పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్‌ రెడ్డి  సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.  మోడీ చంద్రబాబు హనిమున్‌లో ఉండగానే తమ పరిధిలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారంటూ ఆరోపించారు.  

 పరిస్దితి ఇలా ఉండగానే అవిశ్వాస తీర్మానంపై సమాధానమిచ్చిన ప్రధాని .. కాంగ్రెస్ తీరుతో నిత్యం వివాదాలు రగులుతూనే ఉన్నాయన్నారు. ఈ విషయంలో టీడీపీ తెలంగాణతో  పోరాడేందుకు సై అంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిణితితో వ్యవహరించారంటూ ప్రశంసలు కురిపించారు. ప్రధాని వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఉన్నత స్ధానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే వ్యక్తిగతంగా చూడటం తగదన్నారు. ప్రధాని వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు స్వాగతిస్తుండగా ... టీడీపీ నేతలు మాత్రం తప్పుబడుతున్నారు. టీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందాలతోనే తమపై ప్రధాని ఆరోపణలు చేశారంటూ విమర్శిస్తున్నారు. 

English Title
no confidence motion fight between two telugu states

MORE FROM AUTHOR

RELATED ARTICLES