చంద్రబాబు మాకు మిత్రుడే: రాజ్‌నాథ్ సింగ్

Submitted by arun on Fri, 07/20/2018 - 17:51
br

రెండు ఎంపీ స్థానాల నుంచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగామన్నారు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. అతి విశ్వాసం ఎప్పుడు మంచిది కాదన్న ఆయన యూపీఎ ప్రభుత్వంపై తామెన్నడూ అవిశ్వాసం ప్రవేశపెట్టలేదన్నారు. భారత్ ఖ్యాతిని మోడీ ప్రపంచస్థాయికి తీసుకెళ్లారన్న ఆయన మోడీ పిలుపుతో లక్షలాది మంది గ్యాస్‌ సబ్సిడీని వదులుకున్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ఎవరైనా అవిశ్వాసం పెట్టవచ్చన్న ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు బలవంతంగా ఏకమయ్యాయని రాజ్‌నాథ్‌ సింగ్‌ విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు తమకు ఎప్పటికీ మిత్రుడే అన్నారు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీ గురించి మాట్లాడుతూ... ఎన్డీయే నుంచి బయటకొచ్చినా.. చంద్రబాబు ఎప్పటికీ తమకు మిత్రుడే అన్నారు. 14వ ఫైనాన్స్ కమిషన్‌లో ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని.. ఏపీ రెవెన్యూలోటు భర్తీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే రూ.1500 కోట్లు ఇచ్చామన్న ఆయన.. విభజన చట్టంలో హామీలు దాదాపుగా అమలు చేశామన్నారు. మిగిలిన హామీలను కూడా అమలు చేస్తామన్నారు. విభజన తర్వాత ఏపీ సమస్యలేంటో తమకు తెలుసు అంటూ ప్రత్యేక సాయం కింద ఏపీకి నిధులు ఇచ్చేందుకు సిద్ధమన్నారు. 

English Title
No-confidence motion: In democracy, opposition must be respected, says Rajnath Singh

MORE FROM AUTHOR

RELATED ARTICLES