కరీంనగర్ లో బండి సంజయ్ గెలుపు

కరీంనగర్ లో బండి సంజయ్ గెలుపు
x
Highlights

కరీంనగర్ ప్రజలు కారు కాదని ఈసారి కాషాయానికి పట్టం కట్టారు. లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఘన విజయం సాధించారు. ఇక్కడి ...

కరీంనగర్ ప్రజలు కారు కాదని ఈసారి కాషాయానికి పట్టం కట్టారు. లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఘన విజయం సాధించారు. ఇక్కడి నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా వినోద్ కుమార్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమం సమయంలో, రాష్ట్రం ఆవిర్భివంచిన తర్వాత కేసీఆర్‌కు వినోద్ కుడిభుజంగా ఉన్నారు. రాష్ట్ర వ్యవహారాలను కేంద్రస్థాయిలో చక్కదిద్దుతూ వచ్చారు. కరీంనగర్ స్థానంలో వినోద్ కుమార్ విజయం ఖాయమని అందరూ భావించారు. అంచనాలను తలకిందులు చేస్తూ.. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గెలుపొందారు.

గతేడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్ధిగా బండి సంజయ్ బరిలో నిలిచి ఓడిపోయారు. ఆ తర్వాత కూడా ప్రజల్లోనే ఉంటూ బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగిన బండి సంజయ్.. టీఆర్ఎస్ నుంచి బి.వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ ను ఓడించి విజయం సాధించారు.

కరీంనగర్ ఒకప్పుడు కాంగ్రెస్ అడ్డా. ఆ తర్వాత 1998, 99ల్లో బీజేపీ అభ్యర్థిగా సీహెచ్. విద్యాసాగర్ రావు గెలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇక్కడినుంచే 2004, 2006, 2008ల్లో 3 సార్లు గెలిచారు. 2009లో పొన్నం ప్రభాకర్ ఇక్కడ ఎంపీగా లోక్ సభలో అడుగుపెట్టారు. 2014లో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ ఈ సీటును కైవసం చేసుకుంది. బోయినపల్లి వినోద్ కుమార్.. 2019లోనూ గెలుస్తారన్న అంచనాలుండేవి. ఐతే.. ఆ అంచనాలను బండి సంజయ్ పటాపంచలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories