విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుకు కేంద్రం సిద్ధం: తేల్చేసిన కేంద్రమంత్రి

Submitted by arun on Wed, 08/01/2018 - 10:27
visakha railway zone

విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నేతలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిశారు. రైల్వే జోన్‌ ఏర్పాటు మంత్రి సానుకూలంగా స్పందించారని బీజేపీ నేతలు తెలిపారు. మరోవైపు విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మరో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. 

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను ఆంధప్రదేశ్‌ బీజేపీ నేతలు  కలిశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఏపీ బీజేపీ విజ్ఞప్తి పీయూష్‌ సానుకూలంగా స్పందించారని రైల్వే జోన్‌ ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా పేరు లేకపోయినా స్టేటస్‌కు సమానంగా అన్నీ చేస్తున్నామని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. దిల్లీలో జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీలో మాట్లాడిన ఆయన విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. హోదా పేరుతో ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. పార్లమెంటులో అవిశ్వాసం పెట్టే అవకాశం లేకపోయినా ప్రతిపక్షాలు తీసుకొచ్చాయని విమర్శించారు.
 

English Title
nitin-gadkari-response-on-visakha-railway-zone

MORE FROM AUTHOR

RELATED ARTICLES