నీతి ఆయోగ్ సీఈవో సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Tue, 04/24/2018 - 17:40
 niti aayogAmitabh Kant

నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్, యూపీ, చత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు దేశాభివృద్ధికి ఆటంకాలుగా మారుతున్నాయన్నారు. సామాజిక సూచీలో ఆయా రాష్ట్రాల పరిస్థితి మరీ దారుణంగా ఉందని, విద్య, ఆరోగ్య వ్యవస్థలు ఆయా ప్రాంతాల్లో ప్రమాదకరమైన పరిస్థితికి చేరుకున్నాయని చెప్పారు. ఐదో తరగతి పిల్లాడికి చదువుల్లో కనీస పరిజ్ఞానం లేకుండా పోతుందని, చదువుతోపాటు పిల్లల ఆరోగ్య స్థితులను అక్కడి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. దక్షిణ భారతంలో, ఉత్తరాధిలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం చాలా వేగవంతంగా అభివృద్ధి జరుగుతోందని చెప్పారు అమితాబ్ కాంత్. 

English Title
niti aayog ceo amitabh kant sensational comments

MORE FROM AUTHOR

RELATED ARTICLES