నానీ హింట్ ఇచ్చాడా

Submitted by lakshman on Fri, 02/02/2018 - 00:45
nithya menon lesbian role

గ‌తంలో హీరోయిన్ నిత్యామీన‌న్ గురించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్కెర్లు కొట్టిన విష‌యం తెలిసిందే.  న‌ట‌న‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీన‌న్ ఓ సినిమాలో  లెస్బియన్ పాత్రలో కనిపించనుందని. అయితే సుప్రీం కోర్టులో, లెస్బియన్ సెక్స్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో.. లెస్బియన్‌గా నటించే నిత్యామీనన్ రొమాన్స్‌కు సెన్సార్ బోర్డు అనుమతి ఇస్తుందో లేదోనని చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే 
గురువారం రోజు నాని నిర్మాతగా తెర‌కెక్కుతున్న ఆ!! ఫ్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఘ‌నంగా జ‌రిగింది. వ‌చ్చిన అతిధుల‌తో  ఫ్రీ రిలీజ్ ఫంక్ష‌న్ సంద‌డి వాతావార‌ణం లో కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన నాని హీరోయిన్ నిత్యామీన‌న్ పై పొగ‌డ్తల వ‌ర్షం కురిపించాడు. ఈ త‌రహా పాత్రలు చేయ‌డానికి ఎవ‌రు సాహ‌సించ‌రు. కానీ నిత్యా చేయ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని అన్నాడు. నాని నిత్యాను ఇంత‌లా పొగిడేస్తున్నాడ‌ని ఔత్సాహికులు భూత‌ద్దం వేసి మ‌రి చూశారు.  
అయితే  తెలిసిన సమాచారం మేరకు ఇందులో నిత్య మీనన్ పాత్ర లెస్బియన్ తరహాలో ఉంటుందట. కథలో కీలక మలుపుకు కారణమయ్యే ఆ పాత్రలో నిత్య జీవించిందని ఇన్ సైడ్ టాక్. అందుకే నాని అంత స్పెషల్ గా పొగిడాడని అనుకోవచ్చు. ఫిబ్రవరి 16న విడుదల కానున్న అ!! సినిమా అంచనాలు ట్రైలర్ చూసాక అమాంతం పెరిగిపోయాయి. మాస్ మర్డర్ కాన్సెప్ట్ తో కేఫెటేరియా నేపధ్యంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ దీన్ని తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది.    
 

English Title
nithya menon lesbian role in aa, sai dharam tej

MORE FROM AUTHOR

RELATED ARTICLES