జనసేన ఆశలపై నీళ్లు జల్లిన సర్వేలు.. పవన్ కళ్యాణ్ పార్టీ ఆశలు గల్లంతేనా ?

జనసేన ఆశలపై నీళ్లు జల్లిన సర్వేలు.. పవన్ కళ్యాణ్ పార్టీ ఆశలు గల్లంతేనా ?
x
Highlights

సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ ముగిసిన తరువాత ఎగ్జిట్ పోల్స్ వెలువడిన విషయం తెలిసిందే. ప్రజలు ఎప్పుడెప్పుడా అని తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూసి ఎగ్జిట్...

సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ ముగిసిన తరువాత ఎగ్జిట్ పోల్స్ వెలువడిన విషయం తెలిసిందే. ప్రజలు ఎప్పుడెప్పుడా అని తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూసి ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్. అయితే ఏపీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు హోరాహోరిగా పోటి పడ్డాయి అందులో వైసీసీ, జనసేన, టీడీపీ, అయితే ఈ మూడు పార్టీలకు సంబంధించి ప్రాంతీయ, జాతీయ మీడియా సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించాయి. ఈ ఫలితాల్లో జనసేనకు అటు ప్రాంతీయ, జాతీయ మీడియా సంస్థలు జనసేన ఆశలపై నీళ్లు జల్లేలా ఫలితాలు వచ్చాయి. ఏపీ ఎన్నికల ఫలితాలు ఇలా ఉండొచ్చు అంటూ వెలువడిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలు జనసేనను జీరోగా చూపించాయి . ఎన్నికలు ముగిసినప్పటి నుంచి జనసేన పార్టీ వర్గాలు పక్క కింగ్ మేకర్ అవుతామని కలలు కన్న జనసైన్యం. సర్వే సంస్థల గణాంకాల్లో మాత్రం ఎక్కడా జనసేన ఊసే లేకపోవడం గమనార్హం. ఏపీలో జనసేనకు ఏపీలో అంత సినిమా లేదని అటు జాతీయ, ప్రాంత్రీయ మీడియా సంస్థలు తేల్చేయటంతో జనసైనికులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇక లగడపాటి రాజగోపాల్ సర్వేలో కూడా జనసేన రెండు నుంచి మూడు సీట్లకు అటు ఇటుగా వస్తాయని తేల్చింది. అలాగే జనసేనకు 11 శాతం ఓట్లు పడ్డాయని పేర్కొంది. జనసేనకు ఒక లోక్ సభ స్థానం కూడా వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించింది.

ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జయకేతనం ఎగురవేయనున్నట్లు లగడపాటి ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తాజా ఎన్నికల్లో టీడీపీకి 100కు పది సీట్లు అటు ఇటూగా వస్తాయని తెలిపారు. ఇక వైసీపీకి 72 స్థానాలకు పది అటు ఇటూగా వస్తాయన్నారు. ఇక జనసేనతో పాటు ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించవచ్చని అంచనా వేశారు. లోక్ సభ ఎన్నికల్లో టీడీపీకి 13 నుంచి 17 సీట్లు, వైసీపీకి 8 నుంచి 12, ఇతరులకు ఒక సీటు వచ్చే అవకాశముందని లగడపాటి జోస్యం చెప్పారు.

ఇటు జాతీయ సర్వేల్లో పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఇండియా టుడే - మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ అంచనాలో వైసీపీకి 18 నుంచి 20 స్థానాలు, టీడీపీకి 4-6 స్థానాలు వస్తాయని తేల్చింది. అయితే జనసేనను పరిగణలోకి తీసుకోలేదు. అలాగే టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ లో కూడా వైసీపీకి 18 సీట్లు, టీడీపీకి 7 సీట్లు వస్తాయని తేల్చింది. జాతీయ సర్వేల్లో జనసేన ఊసే లేకపోవడం జనసైనికులను కాస్త ఆందోళన కలిగించే అంశమే. మరి ఎవరి నమ్మకం నిజమవుతుందో తెలియాలంటే మరో రెండ్రోజులు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories