బంపరాఫర్.. ఒకే రోజు 10 సినిమాలు!

Submitted by arun on Tue, 06/26/2018 - 16:26
movies

 పండుగల సమయంలో లేదంటే స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో అని సమయం చూసుకొని సినిమాలు  విడుదల చేసే కాలం పోయింది . ఇపుడంతా శుక్రవారం  ట్రెండ్ కొనసాగుతుంది. శుక్ర‌వారం వ‌చ్చిందంటే మినిమం  రెండు, మూడు సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డుతున్నాయి. అయితే, వచ్చే శుక్రవారం (జూన్ 29) పదికి పైగా చిన్న సినిమాలు తెరమీదకొస్తున్నాయి. వీటితోపాటు, చంద్ర సిద్ధార్థ్ ‘ఆటగదారా శివా’, ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రాలు విడుదలకు రెడీ అయినా, సినిమాల తాకిడి దృష్ట్యా రిలీజ్‌ను వాయిదా వేసుకున్నాయి. అయితే ఈ 10 చిత్రాల్లో శంభో శంకరా, ఈ నగరానికి ఏమైంది? చిత్రాలు మినహా మిగిలినవి థియేటర్స్ వరకూ వస్తాయా అన్నది ఇంకా క్లారిటీ లేదు. పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది’, షకలక శంకర్ సినిమా శంభో శంకరా లకు బిజినెస్ బాగానే జరిగినట్టు సమాచారం. జబర్దస్ కామెడియన్‌ శంకర్‌ హీరోగా కనిపిస్తున్న శంభో.. శంకరా సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. మొత్తంగా జూన్ 29న విడుదలయ్యే ఈ పదింటి సినిమాల పేర్లూ ఇలా ఉన్నాయి.
1. శంభో శంకరా.. (శకలక శంకర్)
2. ఈ నగరానికి ఏమైంది? (తరుణ్ భాస్కర్ డైరెక్షన్)
3. ఎస్కేప్ 2
4. కన్నులోని రూపమే
5. మిస్టర్ హోమానంద్
6. IPC సెక్షన్
7. నా లవ్ స్టోరీ
8. యుద్ధ భూమి
9. సూపర్ స్కెచ్
10. సంజీవని

 

English Title
next friday is a big day in tollywood

MORE FROM AUTHOR

RELATED ARTICLES