న్యూస్ చదువుతూ.. లైవ్ లోనే ఏడ్చిన యాంకర్..

న్యూస్ చదువుతూ.. లైవ్ లోనే ఏడ్చిన యాంకర్..
x
Highlights

మెక్సికో నుంచి అమెరికాకు అక్రమంగా తరలి వస్తున్నారంటూ ట్రంప్ ప్రభుత్వం వలసదారులను నిర్భంధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తల్లిదండ్రుల నుంచి...

మెక్సికో నుంచి అమెరికాకు అక్రమంగా తరలి వస్తున్నారంటూ ట్రంప్ ప్రభుత్వం వలసదారులను నిర్భంధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తల్లిదండ్రుల నుంచి పిల్లలని వేరు చేస్తోంది. వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెండర్ ఏజ్ షెల్టర్ల‌కు వారిని తరలిస్తుంది. ఈ దారుణానికి ఒడిగట్టిన అమెరికా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఆడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మంగళవారం ఈ వార్తలు చదువుతున్న టీవీ యాంకర్‌ భావోద్వేగానికి గురై.. ఆ న్యూస్ చదవలేక లైవ్‌లోనే ఏడ్చేసింది. ఎంఎస్‌ఎన్‌బీకి చెందిన యాంకర్ రేచల్ మాడో ఇప్పుడే అందిన వార్త అంటూ తల్లిదండ్రులు కనిపించక పిల్లలు ఏడుస్తున్నారు అని వార్త చదివేసరికి కళ్లవెంట నీళ్లు వచ్చాయి. ఆ తరువాత తేరుకొని న్యూస్ రీడింగ్ కంటిన్యూ చేసింది. కాగా ఆ వార్త విన్నాక తనను తాను నియంత్రించుకోలేకపోయానని ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఇదిలావుంటే బుధవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా- మెక్సికో సరిహద్దుల్లో తల్లితండ్రుల నుంచి పిల్లలను వేరు చేసి నిర్భందించే విధానానికి స్వస్తిపలుకుతూ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే కుటుంబాలను విచ్ఛిన్నం చేసేలా ప్రస్తుత విధానం ఉందనే విమర్శలు వెల్లువెత్తడంతో ట్రంప్‌ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.దీంతో మెక్సికోలో ఆనందోత్సవాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories