మోడీస్ మై భీ చౌకీదార్ స్లోగన్ వార్..

మోడీస్ మై భీ చౌకీదార్ స్లోగన్ వార్..
x
Highlights

ప్రధాని మోడీ ప్రారంభించిన మైభీ చౌకీదార్ నినాదం విమర్శలతో పాపులర్ అవుతోంది. మోడీకి మద్దతుగా బీజేపీ శ్రేణులు ఈ నినాదాన్ని విస్తృతంగా ప్రచారం...

ప్రధాని మోడీ ప్రారంభించిన మైభీ చౌకీదార్ నినాదం విమర్శలతో పాపులర్ అవుతోంది. మోడీకి మద్దతుగా బీజేపీ శ్రేణులు ఈ నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నా కాంగ్రెస్ దీన్ని గట్టిగా కౌంటర్ చేస్తోంది. చౌకీదార్ నినాదాన్ని తీవ్రంగా విమర్శిస్తోంది. దేశానికి తానే అసలైన చౌకీదార్ నంటూ ప్రధాని మోడీ చేసిన, చేస్తున్న ప్రచారంపై పెద్ద యుద్ధం జరుగుతోంది. దేశానికి తాను వాచ్ మన్ గా ఉంటానంటూ ప్రతీ వేదికపైనా మోడీ చెబుతూ వచ్చారు.. ప్రతీ స్టేజ్ పైనా మోడీ తనను ఒక వాచ్ మన్ లాగా చెప్పుకుంటూ వస్తున్నారు దేశం సొమ్ము రూపాయి కూడా బయటకు పోనివ్వనని, ఒక వాచ్ మన్ లా ఎల్ల వేళలా కాపలా కాస్తాననీ చెప్తూ వస్తున్నారు.

చౌకీదార్ నినాదం బాగా అచ్చొచ్చిందని మోడీ టీమ్ అనుకునే టైమ్ లోనే కాంగ్రెస్ దాన్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేసింది. మోడీ చౌకీదార్ కాదని పెద్ద దొంగ అనీ రాఫెల్ డీల్ అందుకు పెద్ద ఉదాహరణ అనీ రాహుల్ విమర్శించారు. దేశానికి కాపలా అని చెప్పే మోడీ రాఫెల్ స్కామ్ జరిగినప్పుడు ఎక్కడికెళ్లారని ఎద్దేవా చేస్తూ వచ్చారు..

ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే ఎన్నికలొచ్చి పడ్డాయ్ తన చౌకీదార్ నినాదం బాగా హిట్టవడంతో మైభీ చౌకీదార్ హు అనే నినాదంతో సోషల్ మీడియా కాంపెయిన్ ప్రారంభించింది బీజేపీ మోడీ నుంచి సందేశాన్ని ఒకరి నుంచి ఒకరికి చైన్ రూపంలో పాస్ ఆన్ అయ్యేలా ఈ నినాదాన్ని వ్యాపింప చేశారు. పరిస్థితిని చూసిన కాంగ్రెస్ దానికి కౌంటర్ గా ప్రచారం మొదలు పెట్టింది. మోడీ బాబా 40 దొంగలు అంటూ విమర్శిస్తోంది.

రాహులే కాదు యూపీలో మూడు రోజుల పర్యటనలో ఉన్న ప్రియాంక కూడా చౌకీదార్ నినాదంపై మండిపడుతున్నారు. మోడీ ఇక ఎంత మాత్రమూ ఈ దేశానికి చౌకీదార్ కాదని ఆయన చేతుల్లో దేశం భద్రంగా లేదనీ మండిపడుతున్నారు. చౌకీదార్ ను మార్చాల్సి ఉందని కామెంట్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories