'నమో' కు నయా వందనం అంటున్న దేశ ప్రజలు..!

నమో కు నయా వందనం అంటున్న దేశ ప్రజలు..!
x
Highlights

బీజేపీ ఖాతాలోకి మరో రెండు రాష్ట్రాలు వచ్చి చేరాయి.. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల్లో ఆ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించి అధికారం...

బీజేపీ ఖాతాలోకి మరో రెండు రాష్ట్రాలు వచ్చి చేరాయి.. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల్లో ఆ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించి అధికారం చేజిక్కించుకుంది.. గుజరాత్ లో అయితే ఏకంగా ఆరుసార్లు అధికారం చేపట్టి రికార్డు సృష్టించింది.. అంతేకాదు గుజరాత్ లో మూడుసార్లు వరుసగా అధికారం చేపట్టిన పార్టీగా చరిత్రకెక్కింది.. 2002 నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న బీజేపీకి తాజాగా ఈ ఎన్నిక హాట్రిక్ అన్న ముద్ర పడింది.. రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీ విజయడంఖా మోగించడంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి..ఇతంతా మోడీ పరిపాలనా నైపుణ్యం అని బీజేపీ నేతలంటుంటే , ఇది కాంగ్రెస్ స్వయంకృతాపరాధమని మరికొందరు విశ్లేషిస్తున్నారు.. ఏది ఏమైనా గుజరాత్ లో అధికార పార్టీకి దీటుగా గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్ కొంత పుంజుకుందనే భావన కలుగుతుంది..

రాహుల్ కు మొదటి ఓటమి..!
దశాబ్దల చరిత్రగల కాంగ్రెస్ కు నెహ్రు కుటుంభంనుంచి నాల్గవ వ్యక్తిగా పార్టీ పగ్గాలు చేపట్టిన యువనేత రాహుల్ గాంధీకి ఈ ఎన్నికలు కొంత చేదు జ్ఞాపకాలనే చెప్పాలి..నిన్నటిదాకా హిమాచల్ లో అధికారం అనుభవించిన ఆ పార్టీ, అక్కడ కూడా తన ప్రాభవాన్ని కోల్పోయింది.. ఇటు గుజరాత్ లో ఈసారి ఎలాగైనా బీజేపీని ఓడించాలని శతవిధాలా ప్రయత్నించినా యువనేతకు నిరాశే ఎదురైయింది.. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా ఉంటుందని ఆశపెట్టుకున్న కాంగ్రెస్ పెద్దలకు ఫలితాలు షాక్ కు గురిచేశాయి.. కానీ ఎంతోకొంత మేలన్నట్టు గౌరవప్రద సీట్లను దక్కించుకుని ఉనికిని కాపాడుకుంది..

ప్రజల విశ్వాసాన్ని మరోసారి కాపాడుకున్న మోడీ..!
గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా పార్టీకి సంచలన విజయాన్ని నమోదు చేయించడంలో కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారని స్పష్టంగా అర్ధమవుతుంది.. నోట్ల రద్దు తరువాత జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా తన హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు.. తాజాగా గుజరాత్ లో ఆ పార్టీకి ముచ్చటగా మూడుసారి విజయాన్ని రుచి చూపించి మరోసారి తన రాజకీయ చాతుర్యతను చాటుకున్న "నమో" కు "నయా" వందనం అంటున్నారు దేశ ప్రజలు..

Show Full Article
Print Article
Next Story
More Stories