ఆ సమయంలో కళ్లు ఎర్రగా ఎందుకు మారతాయి..?

ఆ సమయంలో కళ్లు ఎర్రగా ఎందుకు మారతాయి..?
x
Highlights

నిద్రసోని సమయాలలో చాలామందికి కళ్లు ఎర్రగా మారుతాయి. ఇలా ఎందుకు మారతాయని అనేది చాలా మందికి కలిగే సందేహం. దీనికి ప్రధాన కారణం శరీరంలో ఆక్సిజన్...

నిద్రసోని సమయాలలో చాలామందికి కళ్లు ఎర్రగా మారుతాయి. ఇలా ఎందుకు మారతాయని అనేది చాలా మందికి కలిగే సందేహం. దీనికి ప్రధాన కారణం శరీరంలో ఆక్సిజన్ స్దాయితగ్గడమే. మత్తుగా,అలసటగా ఉన్న సమయాలలో కంటికి సరఫరా అయ్యే ఆక్సిజన్ పరిణామాణం కూడా తగ్గుతూ వస్తుంది. దీంతో కంటిలో ఉండే రక్తనాళాలు ఉబ్బుతాయి. రక్త నాళాలు పైకి తేలి రెడ్‌గా కనిపిస్తాయి. తగినంత సమయం నిద్ర పోయి కంటిని చల్లటి నీటితో కడ్కుకుంటే ఈ ఎరుపు తగ్గుతుంది.

సాధారణంగా మనిషి అలసిపోయినప్పుడు నిద్ర వస్తుంది. దీంతో వచ్చే నిద్రను అపడానికి కళ్లను ఆర్పడం తగ్గిస్తాడు. ఈ కారణంగా కళ్లలలో ఉండే లూబ్రికెంట్ విడుదల తగ్గుతుంది. దీంతో కళ్ళ పొడిబారి దురదలు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో అదే పనిగా కళ్ళను చేతితో నలుపుకుంటారు. ఇలా నలపడం వల్ల కూడా కళ్ళు ఎర్రబడుతాయి. కోన్ని సమయాల్లో రాత్రి కూడా కళ్లు ఎర్రబడుతాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.అలసట, కళ్లు ఎర్రబరాడం, కళ్లు నలపడం, విరామం లేకుండా పగటిపూట పనిచేయడం. సూర్య కిరణాలు తాకిడికి వల్ల కళ్లు ఎర్రగా మారుతాయి. ఇలా సాధరణ పరిస్థితుల్లో కాకుండా మరే ఎదైనా కారణాలతో కళ్లు ఎర్రబడితే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం

చాలా మందిని వేధిస్తున్న సమస్య నిద్రలేమి సమస్య . దీని వల్ల ఆరోగ్యం పాడైపోవడమే కాకుండా మన పని సామర్ధ్యం కూడా తగ్గుతుంది. నిద్ర లేమి ముఖ్యంగా మనిషి మానసిక పరిస్థితిని దెబ్బ తీస్తుంది. మానసిక ఒత్తిడి మనిషికి అనేకరకాల రుగ్మతలకు కారణమవుతుంది. వీటితోపాటు చికాకు, నిద్రలేమి, ఆందోళన వంటివి మనిషిని వేధిస్తుంటాయి. నైట్ షిప్ట్‌ చేసేవారిలో నిద్రలేమి సమస్య కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. నిద్ర లేమితో బాధపడవారిలో డీఎన్‌ఏ సైతం దిబ్బతింటోంది. ఇది కాస్త దీర్ఘకాలిక వ్యాధులను ప్రేరేపించేందుకు దోహదపడుతోంది. ప్రతి రోజూ కనీసం 7-8 గంటల నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories