ఆండ్రాయిడ్ లో తెలియకుండా చేరిన కొత్త నెంబర్ : గూగుల్ క్షమాపణ

ఆండ్రాయిడ్ లో తెలియకుండా చేరిన కొత్త నెంబర్ : గూగుల్ క్షమాపణ
x
Highlights

మీరు కనుక ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్టయితే..ఒక సారి మీ ఫోన్ కీపాడ్ మీద 1947 అనే నెంబర్ టైప్ చేయండి.మీకు ఆటోమాటిక్ గా ఒక కొత్త నెంబరు కనిపిస్తుంది.మీరు...

మీరు కనుక ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్టయితే..ఒక సారి మీ ఫోన్ కీపాడ్ మీద 1947 అనే నెంబర్ టైప్ చేయండి.మీకు ఆటోమాటిక్ గా ఒక కొత్త నెంబరు కనిపిస్తుంది.మీరు సేవ్ చేయకుండానే మీకు కనిపిస్తున్న ఆ నెంబర్ UIDAI సంస్థ టాల్ ఫ్రీ నెంబరు. వేలాది ఫోన్లలో ఎవరు సేవ్ చేయకుండానే ఈ నెంబర్ ఆటోమాటిక్ గా వచ్చి చేరింది.మాకు తెలియకుండా ఇలా ఎలా వస్తుంది ఆండ్రాయిడ్ యుజర్లు చాలా మంది స్క్రీన్ షాట్లు తీసి మరి గూగుల్ కు రిపోర్ట్ చేశారు.విషయాన్ని గమనించిన గూగుల్ అది నిజమేనని,కేవలం అది తమ తప్పిదమేనని ఒప్పుకుంది.దీని వల్ల యుజర్ల భద్రతకు ఎటువంటి ప్రమాదం లేదని కూడా స్పష్టం చేసింది.

కొన్ని అత్యవసరమైన నెంబర్లు,ఎమర్జెన్సీ సేవల ఫోన్ నెంబర్ల ఢీఫాల్ట్ గా ఇస్తామని,అందులో భాగంగానే ఈ నెంబర్ వచ్చినట్టు నిపుణులు భావిస్తున్నారు.ఏది ఏమైన మీరు ఒక సారి 1947 అని టైప్ చేసి చూడండి,మీ లిస్ట్ లోకి కూడా ఆ నెంబర్ వచ్చిందో రాలేదో తెలుస్తుంది.అవసరం అనుకుంటే ఆ నెంబర్ ఉంచుకోండి లేదంటే తీసేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories