స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారా ? ఐతే ఇది చదవాల్సిన మ్యాటరే...

స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారా ? ఐతే ఇది చదవాల్సిన మ్యాటరే...
x
Highlights

ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో స్మార్ట్ ఫోన్‌లు, ట్యాబ్లెట్ల వినియోగం ఎక్కువైపోయింది. ఎవరి చేతుల్లో చూసినా అవే కనిపిస్తున్నాయి. వాటికి మనం బాగా అడిక్ట్...

ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో స్మార్ట్ ఫోన్‌లు, ట్యాబ్లెట్ల వినియోగం ఎక్కువైపోయింది. ఎవరి చేతుల్లో చూసినా అవే కనిపిస్తున్నాయి. వాటికి మనం బాగా అడిక్ట్ అయిపోయారు. అయితే వీటిని ఎక్కువగా వినియోగించినట్లయితే వాటి నుండి వెలువడే బ్లూ లైట్ వలన కంటికి ముప్పు తప్పదు. స్మార్ట్ ఫోన్ తయారీలో బ్లూలైట్ ఉపయోగిస్తారు. రాత్రి పూట నిద్ర రావడానికి కారణం ఆ సమయంలో శరీరంలో విడుదలయ్యే మెలటోనిన్ అనే హార్మోన్ ఈ హార్మోన్ సాయంత్రం నుంచి శరీరంలో మెల్ల మెల్లగా విడుదల అవుతుంది. అయితే రాత్రి పూట స్మార్ట్ ఫోన్‌ని ఉపయోగిస్తుంటే దాని నుండి వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ హార్మోన్‌పై ప్రభావం చూపుతుంది. తద్వారా మెలటోనిన్ విడుదల తగ్గుతుంది.

అందుకే నిద్రలేమి సమస్య వస్తుంది. రాత్రిపూట స్మార్ట్ ఫోన్‌ల వినియోగం అంత మంచిది కాదు. నిద్రకు ఉపకరించే గంట ముందు స్మార్ట్ ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లను దూరంగా ఉంచితే కంటికి, మెదడుకు విశ్రాంతి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.ఒకవేళ ఉపయోగిస్తే దాని నుంచి వచ్చే బ్లూ లైట్‌ని ఆటోమేటిక్ నియంత్రించేలా సెట్ చేసుకోవాలి. నిద్రకు ఉపక్రమించే గంట ముందు స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్ దూరంగా వుండటం ద్వారా కంటికి, మెదడుకు విశ్రాంతి ఇచ్చినవారమవుతామని వైద్యులు సూచిస్తున్నారు ...

Show Full Article
Print Article
Next Story
More Stories