తుఫాన్‌లో పాప జననం...తిత్లీగా నామకరణం

తుఫాన్‌లో పాప జననం...తిత్లీగా నామకరణం
x
Highlights

ఓడిశాను వణికించిన తిత్లీ తుపాన్ ఓ కుటుంబానికి తీపి గుర్తు మిగిల్చిన అరుదైన ఘటన మిడ్నాపూర్ ప్రాంతంలో వెలుగుచూసింది. ‘తిత్లీ’ తుపాన్ ఒడిశా రాష్ట్రంలోని...

ఓడిశాను వణికించిన తిత్లీ తుపాన్ ఓ కుటుంబానికి తీపి గుర్తు మిగిల్చిన అరుదైన ఘటన మిడ్నాపూర్ ప్రాంతంలో వెలుగుచూసింది. ‘తిత్లీ’ తుపాన్ ఒడిశా రాష్ట్రంలోని మిడ్నాపూర్ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. కానీ ఈ నెల 12న హోరు వీస్తున్న గాలిలో, జోరు వానలో మిడ్నాపూర్ లోని తుపాన్‌గంజ్ ప్రాంతానికి చెందిన పాఠశాల ఉపాధ్యాయని అయిన 31 ఏళ్ల ఇషితాదాస్‌కు ఓ బాలిక జన్మించింది. ఇండియన్ ఆయిల్ కంపెనీలో ఫీల్డు ఆఫీసరుగా పనిచేస్తున్న ప్రదీప్ టమయ్, ఇషితాదాస్‌ల వివాహం 2011లో జరిగింది. ఇషితాదాస్ గర్భం దాల్చాక తుపాన్‌లో జోరు వాన కురుస్తుండగానే బాలికకు జన్మనిచ్చింది. భారీ వర్షంతో తుపాన్ ప్రారంభం కావడంతో తాము ఆందోళన చెందామని కానీ, సుఖ ప్రసవం కావడంతో తన మనవరాలికి తన తండ్రి ‘తిత్లీ’ అని తుపాన్ పేరు పెట్టారని తండ్రి ప్రదీప్ చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories