కాళేశ్వరం ప్రాజెక్టు ఆరో ప్యాకేజీలో సక్సెస్.. మరి అధికారుల ముందు ఉన్న ఆ సవాల్ ఏంటి ..?

కాళేశ్వరం ప్రాజెక్టు ఆరో ప్యాకేజీలో సక్సెస్.. మరి అధికారుల ముందు ఉన్న ఆ సవాల్ ఏంటి ..?
x
Highlights

కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. వెట్‌ రన్‌లతో అధికారులు దూసుకెళుతున్నారు. ఇప్పటి వరకు అన్నింట్లో సక్సెస్‌ అవుతున్న అధికారులు...

కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. వెట్‌ రన్‌లతో అధికారులు దూసుకెళుతున్నారు. ఇప్పటి వరకు అన్నింట్లో సక్సెస్‌ అవుతున్న అధికారులు అసలైన విజయం కోసం ప్రణాళిక చేస్తున్నారు. మరి అధికారుల ముందు ఉన్న ఆ సవాల్ ఏంటి ..? కాళేశ్వరం ప్రాజెక్టు ఆరో ప్యాకేజీలో అధికారులు సక్సెస్ అయ్యారు. ఎల్లంపల్లి నుండి ఆరో ప్యాకేజీలోని సర్జిఫుల్ ‌లో నీళ్లు నింపి అందులో నుండి పంపుల ద్వారా బయటికి నీళ్లని పంప్ చేశారు. ఇందుకోసం అండర్ ప్రతి కార్మికుడు, ప్రతి ఇంజినీర్‌ గ్రౌండ్‌లో పని చేస్తూ రాత్రింబవళ్లు శ్రమించారు. ఒక్క లీకేజీ లేకుండా ఏకకాలంలో విజయం సాధించారు.

ఆరో ప్యాకేజ్ విజయవంతం చేసిన అధికారులు మరో సవాల్‌కు సిద్ధమవుతున్నారు. ఆరో ప్యాకేజీ నుండి వచ్చిన నీళ్లను పంపింగ్ ద్వారా నంది మేడారం రిజర్వాయర్‌లోకి వదిలారు. అక్కడి నుండి ఈ నీళ్లు 7వ ప్యాకేజీలోకి పంపిస్తారు. మేడారం రిజర్వాయర్ నుండి నీళ్లు 11.23 కిలోమీటర్ల మేర ఉన్న అండర్ గ్రౌండ్ టన్నెల్ ద్వారా 7వ ప్యాకేజీకి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ టన్నెల్ పనులు ఈ నెలాఖరులోపు మొత్తం పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ఏడవ ప్యాకేజీలో కూడా వెట్ రన్ పూర్తయ్యాక ఆసియాలోనే అతిపెద్ద పంప్‌ హౌజ్ ఉన్న ప్యాకేజీ 8లోకి నీళ్లు వస్తాయి.

నందిమేడారంలో 6వ ప్యాకేజీ కంటే రామడుగులో ఉన్న 8వ ప్యాకేజీ కెపాసిటి చాలా పెద్దది. 6వ ప్యాకేజీతో పోలిస్తే 8వ ప్యాకేజీ పంపుల కెపాసిటి దాదాపు 15 మెగావాట్ల సామర్థ్యం ఎక్కువ. 8వ ప్యాకేజీలో మోటార్లు ఒక్కొక్కటి 15 మీటర్లు ఉంటాయి. 22 మీటర్ల వెడల్పు, 650 టన్నుల బరువుంటాయి ఈ మోటార్లు. రైతులు వాడే 5హెచ్‌పి మోటార్లతో పోలిస్తే కాళేశ్వరం పంప్‌హౌజ్‌లో ఉపయోగించే ఒక్కో మోటారు సుమారు 37వేల హెచ్‌పి మోటార్లతో సమానం. ఈ మోటార్లు 115 మీటర్ల లోతు నుంచి 3,200 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీటిని ఎత్తి పోస్తుంది.

ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న ఈ పంప్‌హౌజ్‌లో మొత్తంగా 7 మోటార్ల నిర్మాణం చేయాల్సి ఉండగా ఇప్పటికే ఐదు సిద్ధంగా ఉన్నాయి. మరో రెండింటిని మే నెలాఖరుకు పూర్తి చేయనున్నారు అధికారులు. 2కోట్ల లీటర్ల సామర్థ్యం ఉన్న 8వ ప్యాకేజీలోని సర్జిఫుల్ ‌లో నీళ్లు నింపేందుకు మొదట అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ పనులు పూర్తి అవడానికి మరో నెలరోజుల సమయం పడుతుంది. జూన్ మొదటి వారంలో 8వ ప్యాకేజీలో నుండి నీళ్లని వెట్‌రన్ నిర్వహించి ఇక్కడి నుండే మిడ్ మానేరుకు నీళ్లు తరలిస్తారు. మరి అధికారుల ప్రణాళిక ప్రకారం పనులు జరిగి మిడ్ మానేరుకు నీళ్లు చేరితే కాళేశ్వరం ప్రాజెక్టులోని అసలైన మైలు రాయిని చేరినట్టేనని భావిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories