logo

వచ్చే నెల 8న వైసీపీలోకి మాజీ సీఎం కుటుంబం

వచ్చే నెల 8న వైసీపీలోకి మాజీ సీఎం కుటుంబం

ఎన్నికలు సమీపిస్తున్న కొలది నేతలు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. అందులో భాగంగా ఏపీలో ప్రతిపక్ష వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. వచ్చే నెల 2వ తేదీన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆ పార్టీలో చేరుతున్నారు. అలాగే మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరేందుకు ముహూర్తం సిద్ధం చేసుకున్నారు. తమ కుటుంబం ఈనెల 8న వైసీపీలో చేరుతున్నట్టు రామ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అయన ప్రకటన సందర్బంగా యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు హర్షం వ్యక్తం చేశారు. నేదురుమల్లి కుటుంబం వైసీపీలో చేరితే పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.

లైవ్ టీవి

Share it
Top