వైసీపీలో చేరనున్న మాజీ సీఎం కొడుకు!

Submitted by nanireddy on Sun, 07/22/2018 - 16:46
nedhurumalli ramkumarreddy will join ycp

ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉన్నందున ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. మరో రెండు రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి  కుమారుడు రాంకుమార్ రెడ్డి వైసీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో కాకలు తీరిన రాజకీయ నేతగా గుర్తింపు పొందిన ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరడానికి ముహూర్తం సిద్ధం చేసుకున్నారు. అయన వెంకటగిరి సీటు ఆశిస్తున్నారు. జగన్ కూడా అందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే అవ్వాలని ఆ సీటుపై కోరిక పెంచుకున్న రాంకుమార్ రెడ్డి వైసీపీలో చేరి ఆ ముచ్చట తీర్చుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు సడన్ గా ఆనం రామనారాయణ రెడ్డి వచ్చి ఆ సీటును ఎత్తుకెళతారేమోనని ఆయనలో టెన్షన్ మొదలైందట. దీంతో ఎంత త్వరగా వైసీపీలో చేరితే అంత మంచిదన్న అభిప్రాయంలో రాంకుమార్ రెడ్డి ఉన్నట్టు వినికిడి. ఇందులో భాగంగా శనివారం కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేసి ఆగమేఘాలమీద వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అన్ని కుదిరితే సోమవారం లేదా బుధవారం జగన్ ను కలిసే అవకాశమున్నట్టు పార్టీ వర్గాలు అంగీకరిస్తున్నాయి.   

English Title
nedhurumalli ramkumarreddy will join ycp

MORE FROM AUTHOR

RELATED ARTICLES