వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించిన బీజేపీ కీలకనేత.. అధినేత ఫోన్..

వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించిన బీజేపీ కీలకనేత.. అధినేత ఫోన్..
x
Highlights

ఎన్నికలు సమీపిస్తున్న కొలది వివిధ పార్టీలలోకి వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీల నుంచి వచ్చిన నేతలతో టీడీపీ ఓవర్లోడ్ అయింది. దాంతో ఆ పార్టీ...

ఎన్నికలు సమీపిస్తున్న కొలది వివిధ పార్టీలలోకి వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీల నుంచి వచ్చిన నేతలతో టీడీపీ ఓవర్లోడ్ అయింది. దాంతో ఆ పార్టీ పెద్దగా వలసలను ప్రోత్సహించడం లేదు. ఈ క్రమంలో వైసీపీ వలసవాదులు తలుపులు బారల తెరిచింది. దాంతో ఇప్పటికే కొందరు నేతలు ఆ పార్టీలో చేరడానికి ముహూర్తం సిద్ధం చేసుకున్నారు. తాజగా మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుటుంబ వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించింది.
ఈ విషయాన్నీ జనార్దన్ రెడ్డి వారసుడు రామ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున వెంకటగిరి నుంచి పోటీ చేసిన ఓడిపోయిన రామ్ కుమార్ రెడ్డి.. తర్వాత వెంకయ్యనాయుడు సమక్షంలో బీజేపీలో చేరారు. మారుతున్న రాజకీయ సమీకరణల్లో ఆయన బీజేపీలో ఇమడలేకపోయారు. ఈ నేపధ్యంలో ఇటీవలే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. చివరకు వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. అయితే ఏ నియోజకవర్గంలో పోటీచేయాలన్నది జగన్ ఆదేశాలకనుగుణంగా ఉంటుందని రామ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం కోసం పనిచేస్తానన్నారు. అయితే రామ్ కుమార్ రెడ్డి పార్టీ మార్పు ప్రకటన తెలుసుకున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రామ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి బుజ్జగింగించే ప్రయత్నం చేశారు. కానీ అయన పార్టీ మారేందుకే మొగ్గు చూపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories