ద్విభాషా 'నయనం'
కేరళకుట్టి నయనతార ప్రస్తుతం రెండు తెలుగు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి'లోనూ , బాలకృష్ణ 102వ చిత్రంలోనూ ఈ మలయాళ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు తమిళ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. నయనతార తాజాగా ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రానికి సంతకం చేసింది. యాక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుంది.
'వైశాలి' దర్శకుడు అరివళగన్ రూపొందించనున్న ఈ చిత్రానికి థమన్ సంగీతమందించనున్నారు. ప్రీ పొడక్షన్‌కే మూడు నెలల సమయం పట్టే ఈ సినిమా.. నయనతార డేట్స్ విషయంలో క్లారిటీ వస్తే కేవలం 45 రోజుల్లో పూర్తిచేయాలని దర్శకుడు భావిస్తున్నాడు. డిఫరెంట్ జోనర్‌లో సినిమాలు తీసే అరివళగన్ 'వైశాలి'(తమిళంలో 'ఈరమ్')ని హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తే.. 'ఆరాదు సినమ్'ని ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గానూ, 'కుట్రమ్ 23'ని మెడికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. ఇప్పుడు తాజా చిత్రాన్ని యాక్షన్ సైకాలజికల్ థ్రిల్లర్గా చేయబోతున్నాడు. నయనతార స్టార్‌డమ్‌కి తగ్గ సినిమా ఇదని, ఆమెని కొత్త కోణంలో చూపించే సినిమా అవుతుందని ఆయన చెబుతున్నాడు. డిసెంబర్‌లో లేదా జనవరిలో ఈ సినిమా ప్రారంభం కానుంది.
లైవ్ టీవి
నాటకమైన, సినిమా అయిన ఈయన స్టైల్ వేరు
18 Feb 2019 10:19 AM GMTసినిమా కథలో మలుపులాగానే సంగీత దర్శకుడి జీవితం
18 Feb 2019 10:15 AM GMTసరిహద్దున నువ్వు లేకుంటే ఓ సైనిక!
18 Feb 2019 9:52 AM GMTపుణ్యభూమి నా దేశం నమో నమామీ!
18 Feb 2019 9:44 AM GMTదేవ్...వావ్ అయితే కాదు...
15 Feb 2019 11:03 AM GMT