సిరా చుక్క కనిపిస్తే వేళ్లను కట్ చేస్తాం..

సిరా చుక్క కనిపిస్తే వేళ్లను కట్ చేస్తాం..
x
Highlights

తొలిదశ పోలింగ్ దృష్ట్యా ఛత్తీస్‌గఢ్‌ లోని 18 నియోజకవర్గాలు శత్రుదుర్భేద్యంగా మారాయి. పోలింగ్‌ను బహిష్కరించాలంటూ మావోయిస్టులు పిలుపు నిచ్చిన నేపథ్యంలో...

తొలిదశ పోలింగ్ దృష్ట్యా ఛత్తీస్‌గఢ్‌ లోని 18 నియోజకవర్గాలు శత్రుదుర్భేద్యంగా మారాయి. పోలింగ్‌ను బహిష్కరించాలంటూ మావోయిస్టులు పిలుపు నిచ్చిన నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. అయితే దంతెవాడ జిల్లాలోని మాదేండ గ్రామప్రజలు ఓటింగ్ లో పాల్గోన్నొదని హెచ్చిరిచారు. చేతి వేలికి సిరా చుక్కు కనిపించిన వారి వేళ్లను నరికేస్తామని మావోయిస్టులు భయభ్రంతులకు గురిచేసారని స్థానికులు తెలిపారు. అయినా ఇప్పటివరకు 263 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలను కలిపి లక్ష మందిని మోహరించారు. 650 కంపెనీలకు చెందిన 65 వేల భద్రతా సిబ్బందితో పాటు సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ ,ఇండో-టిబెటన్‌ సరిహద్దు పోలీసులతో పాటు ఇతర దళాలకు చెందిన భద్రతా బలగాలను మోహరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories