టీఆర్ఎస్‌లో చేరడంపై స్వరం మార్చిన జగ్గారెడ్డి.. మే 24న..

టీఆర్ఎస్‌లో చేరడంపై స్వరం మార్చిన జగ్గారెడ్డి.. మే 24న..
x
Highlights

అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ తో మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో..ఇప్పుడు అందరి దృష్టి సంగారెడ్డి...

అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ తో మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో..ఇప్పుడు అందరి దృష్టి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పడింది. జగ్గారెడ్డి కూడా త్వరలో కారెక్కుతారంటున్న వార్తలు జోరుగా వినిపించాయి. అయితే జగ్గారెడ్డి మాత్రం మొదట్లో పార్టీ మార్పును ఖండిస్తూ వచ్చినా ఆ తర్వాత ఎక్కడ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు అంతగా లేకపోవడంతో గులాబీ కండువ కప్పుకుంటారనేదానికి బలం చేకూరుతుంది.

రాష్ర్టంలో టీఆర్ఎస్ పార్టీ గాలి బలంగా వీస్తున్నా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన హామీలు జగ్గారెడ్డిని గెలిపించాయి. అప్పటి నుంచి సీఎం కేసీఆర్ సైతం జగ్గారెడ్డి విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించారు. జగ్గారెడ్డి కోరిన విధంగా సంగారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరుకు ప్రాధాన్యత ఇస్తానని అసెంబ్లీలో ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే జగ్గారెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ వచ్చిన వార్తలను ఆయన తోసిపుట్టారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడే ప్రసక్తి లేదంటూ ప్రకటించారు. దీంతో అప్పట్లోనే టీఆర్ఎస్ లో చేరుతారన్న ఊహాగానాలకు పుల్ స్టాప్ పడింది.

జగ్గారెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ మారనని ప్రకటించిన జగ్గారెడ్డి వైఖరిలో కాస్తా మార్పు వచ్చింది. టీఆర్ఎస్‌లో చేరే విషయం కాలమే నిర్ణయిస్తుందని స్వరం మార్చారు. జ‌గ్గారెడ్డి ష‌ర‌తుల‌ు అన్నీ అంగీకరించేందుకు సిద్ధమంటూ కేటీఆర్ దూత‌లు స‌మాచారం సైతం పంపారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే జగ్గారెడ్డి ఎలాంటి షరతులు లేకుండానే గులాబీ తీర్ధం పుచ్చుకోవాలని భావిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ వీడి టీఆర్ఎస్ లో చేర‌డం వ‌ల్ల ఇంటా బ‌య‌ట విమ‌ర్శలు ఎదుర్కొన్న సంగారెడ్డి ప్ర‌జ‌ల అభివృద్దికోసం, ఇళ్లు లేని నిరుపేద‌ల ఇంటి స్థ‌లాల కోసం తాను తీసుకుంటున్నఈ నిర్ణ‌యాన్ని ప్ర‌జ‌లు అర్థం చేసుకుంటార‌ని జ‌గ్గారెడ్డి భావిస్తున్నార‌ట‌. మే 24న జ‌గ్గారెడ్డి గులాబీ కండువ కప్పుకోనేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories