నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితుణ్నే..యువ నటుడు

Submitted by arun on Sat, 07/14/2018 - 16:08
Mollywood

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పెద్ద దుమారాన్ని రేపుతోంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ ఇలా భాషల ఇండస్ట్రీలలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని అనేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. అయితే కాస్టింగ్ కౌచ్ అమ్మాయిలకు మాత్రమే కాదని తను కూడా ఎదుర్కొన్నట్లు నటుడు రవికిషన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో పురుషులకు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయా అని అందరూ ఆశ్చర్యపోయారు.

తాజాగా మరో యువనటుడు దీనిపై గొంతెత్తాడు. అతని పేరు నవజిత్ నారాయణ్. మలయాళ నటుడు. టాలీవుడ్ లో మాదిరి మాలీవుడ్ లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉన్నట్లు పలువురు నటీమణులు చెబుతున్న నేపథ్యంలో నవజిత్ స్పందించారు. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుణ్నే అని వెల్లడించారు. ఈమేరకు సోషల్ మీడియాలో తన వ్యథను పంచుకున్నాడు. వుయ్ ఆర్ ఆల్సో నాట్ సేఫ్ అనే శీర్షికతో పెట్టిన పోస్టులో తనను ఓ దర్శకుడు ఎలా వేధించిందీ వివరించాడు.

‘ఒక దర్శకుడు నాకు సినిమాలో అవకాశం ఇస్తానన్నాడు. నేను వెళ్లాను. వేషానికి బదులుగా ఏమిస్తావని నన్ను అడిగాడు. నాతో అలా మాట్లాడుతూ నా తొడలపై చేతులు వేసి కౌగిలించుకోవడానికి యత్నించాడు. అయితే నాకు అలాంటి ఉద్దేశం లేదని, చేతులు తీయాలని తెగేసి చెప్పాను. అయినా అతడు పట్టించుకోక దగ్గరయ్యేందుకు యత్నించాడు. నేను కోపంతో అతని చెంప పగలగొట్టాను…’ అని వివరించాడు. అయితే సదరు దర్శకుడి పేరేమిటో నవజిత్ బయటపెట్టలేదు. అతడు తమ కుటుంబానికి దగ్గరివాడని, అతని పరువును బజారుకు ఈడ్చడం తనకిష్టం లేదని అన్నాడు.

English Title
Navajith Narayanan opens up about casting couch in Mollywood

MORE FROM AUTHOR

RELATED ARTICLES