శ్రీరెడ్డి ఇష్యూపై నాని భార్య స్పంద‌న‌!

Submitted by arun on Tue, 06/12/2018 - 13:20
sri

సోషల్ మీడియా సాక్షింగా నేచురల్ స్టార్ నాని, నటి శ్రీరెడ్డికి పెద్ద వార్ నడుస్తుంది. తాజాగా బిగ్ బాస్ 2 హోస్ట్ గా వ్యవహరిస్తున్న నానిని టార్గెట్ చేస్తూ చేసిన వాఖ్యలకు నాని స్పందించి ఆమెకు లీగ‌ల్ నోటీసులు పంపించాడు.`స‌హ‌నానికి కూడా ఓ హ‌ద్దు ఉంటుంద`ని కామెంట్ చేస్తూ శ్రీరెడ్డిక పంపిన‌ లీగ‌ల్ నోటీసును త‌న ట్విట‌ర్ ఖాతాలో నాని పోస్ట్ చేశాడు. దానికి శ్రీరెడ్డి స్పందించి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దారుణంగా ట్విట్ చేసింది.  

తాజాగా ఈ ఉదంతంపై నాని భార్య అంజ‌న ట్విట‌ర్ ద్వారా స్పందించారు. ‘‘సినీ ప‌రిశ్ర‌మ చాలా ద‌యాగుణంతో ఉంటుంది. కానీ, ప‌బ్లిసిటీ కోసం వేరొక‌రి జీవితాల‌తో ఆడుకుంటున్న వారు కూడా అప్పుడప్పుడు అందులోకి వ‌స్తుండ‌డం నన్ను ఇబ్బందికి గురిచేస్తోంది. అయితే వారు చేస్తున్న చెత్త కామెంట్లను ఎవ‌రూ ప‌ట్టించుకోర‌నుకోండి. కానీ, త‌మ వ్య‌క్తిగత జీవితాన్ని అంత దిగువ స్థాయికి దిగ‌జార్చుకోవ‌డానికి వారు ఎలా సిద్ధ‌ప‌డ‌తారో’’ అంటూ అంజ‌న ట్వీట్ చేశారు.

English Title
Natural Star Nani wife Reacts On Sri Reddy Controversy

MORE FROM AUTHOR

RELATED ARTICLES