ఆ తేనెటీగను చూస్తే ఊపిరి ఆగిపోతుందట!

ఆ తేనెటీగను చూస్తే ఊపిరి ఆగిపోతుందట!
x
Highlights

ఆ తేనెటీగను చూస్తే ఊపిరి ఆగిపోతుందట.. అవును మీరు చదువుతున్నది నిజం. అందంగా, భారీగా ఉండే ఆ తేనెటీగ చాలా డేంజర్ అంటున్నారు. వాటి రెక్కల నుండి చాల...

ఆ తేనెటీగను చూస్తే ఊపిరి ఆగిపోతుందట.. అవును మీరు చదువుతున్నది నిజం. అందంగా, భారీగా ఉండే ఆ తేనెటీగ చాలా డేంజర్ అంటున్నారు. వాటి రెక్కల నుండి చాల బయంకరమైన శబ్దాలు వస్తాయట.

ప్రపంచంలోనే అతి పెద్దదైనా ఈ తేనెటీగ ఇండోనేషియాలోని మారుమూల ద్వీపంలో ఉందట. దీని పొడపు రెక్కలతో కలిపి 6 సెం.మీ.. వరకు ఉంటుంది. ఈ జాతుల్లోని ఆడ తేనెటీగలు పుట్టల్లో గూడు కట్టుకొని ఉంటాయి. తమ పొడువాటి దవడతో చెట్ల నుంచి జిగురును సేకరించి తమ గూడును పటిష్టంగా మార్చుకుంటాయి. దట్టమైన చెట్లు ఉండే అడవుల్లోనే ఇవి కనివసిస్తాయి. చెట్ల నుంచి వచ్చే జిగురుపై ఇవి ఆధారపడుతాయి.

ఇండోనేసియాలోని ఉత్తర మొలక్కస్‌ దీవిలో దీన్ని కనుగొన్నారు. బ్రిటిష్ పరిశోధకుడు ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలేస్ 1858 లో ఈ తేనెటీగ గురించి వర్ణించారు. అప్పటి నుంచి ఈ కీటకాన్ని ఆయన పేరుతోనే వాలేస్‌గా పిలుస్తున్నారు. 1981లో శాస్త్రవేత్తలు అనేక రకాల తేనెటీగ జాతులను గుర్తించారు. కానీ, అందులో ఈ వాలేస్ జాతి కనిపించకపోవటం విశేషం. "ఫ్లయింగ్ బుల్‌డాగ్" గా కనిపించే ఆ తేనెటీగను చూస్తే ఊపిరి ఆగిపోతుందని కొందరు చెబుతుంటారు. అయితే సరైన ఆధారాలు లేకుంటే ఇలాంటివి నమ్మలేం అంటున్నారు శాస్త్రవేత్తలు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories