‘మావారు రాముడి లాంటి వారు..’

Submitted by arun on Thu, 06/21/2018 - 12:37
Jashodaben

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వివాహం కాలేదంటూ ఇటీవల మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇది కాస్తా సోషల్‌మీడియా, స్థానిక మీడియాలో వైరల్‌గా మారడంతో ఆనందిబెన్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సతీమణి జశోదాబెన్‌ స్పందించారు. ప్రధానిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆమె అన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో సమర్పించిన డిక్లరేషన్‌ పేపర్లలో తనకు పెళ్లి అయిందని మోదీ స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. ఆమె వ్యాఖ్యల వల్ల ప్రధాని ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశం ఉందని, మోదీ చాలా గౌరవనీయుడు.. ఆయన తనకు రాముడు అని జశోదాబెన్ వ్యాఖ్యానించారు.

జశోదా మాట్లాడిన ఈ విషయాలను మొబైల్‌ ఫోన్‌లో వీడియోలో షూట్ చేశారు ఆమె బ్రదర్ అశోక్ మోదీ. ఆనందీబెన్ ఈ వ్యాఖ్యలు ఎప్పుడు చేశారో తమకు తెలియదని, ఈనెల 19న మొదటి పేజీలో వచ్చిందని అశోక్ తెలిపారు. ఆనందీబెన్ వ్యాఖ్యలకు రిప్లై ఇవ్వాలనే ఉద్దేశంతోనే వీడియో చిత్రీకరించినట్టు ఆయన వివరించారు.

English Title
Narendra Modi had indeed married me, he is Ram for me: Jashodaben

MORE FROM AUTHOR

RELATED ARTICLES