logo

తెలంగాణలో మోదీ, అమిత్‌ షా షెడ్యూల్‌

తెలంగాణలో మోదీ, అమిత్‌ షా షెడ్యూల్‌

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు రోడ్ షోలు, బహిరంగ సభలతో తమ ప్రచారంను సాగిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి బీజేపీ అగ్రనేతల తరలి వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా లు తెలంగాణలో పోటీ చేస్తున్న అభ్యర్ధుల తరపున ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 27న ఉదయం నిజామాబాద్‌లో, మధ్యాహ్నం వరంగల్‌లో నరేంద్రమోడీ సభ బహిరంగ సభలు జరగనున్నాయి. అదే విధంగా డిసెంబర్‌ 3న హైదరాబాద్‌లో కూడా మోడీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఈ నెల 25, 28 తేదీలలోనూ వచ్చే నెల 2 తేదీల్లో అమిత్ షా సభలు ఉన్నాయి. దీంతో తెలంగాణ బిజెపి నాయకులు విస్తృతంగా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు.

లైవ్ టీవి

Share it
Top